iDreamPost
iDreamPost
తమిళ్ లో గత ఏడాది బ్లాక్ బస్టర్ గా నిలిచిన లవ్ క్లాసిక్ 96 తెలుగులో జానుగా వచ్చే నెల 7న విడుదల కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఇందులో కంటెంట్ విషయానికి వస్తే ఒరిజినల్ ఫీల్ యధాతథంగా క్యారీ చేయడం కోసం ఎలాంటి మార్పులు చేయనట్టు కనిపిస్తోంది. పదో తరగతిలో కలిసి చదువుకున్న రామచంద్ర అలియాస్ రామ్(శర్వానంద్), జానకి అలియాస్ జాను(సమంతా)చాలా ఏళ్ళ తర్వాత తిరిగి కలుసుకుంటారు. వాళ్ళతో పాటు అప్పటి స్నేహితులు కూడా జాయిన్ అవుతారు.
మరి తెలిసి తెలియని టీనేజ్ వయసులోనే ప్రేమించుకున్న రామ్ జానులు ఇప్పుడు కలుసుకున్నాక వాళ్ళలో కలిగిన ఎమోషన్స్, రేగిన స్పందనలు ఎలాంటివి ఇవే జాను కథలో కీలకం. టీజర్ లుక్ ఫ్రెష్ గానే ఉంది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ పార్ట్ ని ఎలాంటి మార్పులు చేయకుండా తీయడంతో న్యాచురల్ గా వచ్చినట్టు అనిపిస్తోంది.
ఒరిజినల్ వెర్షన్ చూడని వాళ్లకు జాను ఒక మంచి ఫీల్ ఇస్తుందేమో కానీ ఆల్రెడీ దాన్ని చూసి ప్రేమించిన వాళ్ళు విజయ్ సేతుపతి-త్రిష పాత్రల్లో శర్వా సామ్ లను ఎంతవరకు మెచ్చేలా అంగీకరిస్తారో విడుదలయ్యేదాకా వేచి చూడాలి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంతో పాటు గోవింద్ వసంత్ సంగీతం, మహేంద్రన్ జయరాజు ఛాయాగ్రహణం 96ని తెలుగు ప్రేక్షకులకు జానుగా అందించడంలో మంచి పాత్రే పోషించినట్టు కనిపిస్తున్నాయి. శర్వానంద్ సమంతాలు చక్కని హావభావాలు పలికించగా వెన్నెల కిషోర్, రఘుబాబు తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
Trailer Link Here @ bit.ly/36ASzpd