iDreamPost
iDreamPost
శర్వానంద్ సమంతా ఫస్ట్ టైం కాంబినేషన్ లో రూపొందిన తమిళ కల్ట్ క్లాసిక్ 96 రీమేక్ జాను నిన్న డీసెంట్ ఓపెనింగ్స్ తో విడుదలైంది. చెప్పుకోదగ్గ పోటీ లేనప్పటికీ జాను మాస్ ఆడియన్స్ ని టార్గెట్ చేసిన మూవీ కాకపోవడంతో నిన్న థియేటర్లలో ఎక్కువగా యూత్ దర్శనమిచ్చారు. ఇప్పడీ వీకెండ్ ని జాను ఎంత బాగా ఉపయోగించుకుంటే అంత మెరుగుదల ఉంటుంది. విశ్వసనీయ సమాచారం మేరకు మొదటి రోజు సుమారుగా 2 కోట్ల 10 లక్షల షేర్ రాబట్టినట్టు తెలిసింది. ముఖ్యంగా నైజామ్ లో 80లక్షల షేర్ తో మిగిలిన చోట్ల కంటే ఎక్కువ రాబట్టింది. నెల్లూరులో చాలా తక్కువగా 6 లక్షలు వచ్చాయి. రివ్యూలు చాలా మటుకు పాజిటివ్ గానే ఉండటంతో పికప్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాయి ట్రేడ్ వర్గాలు.
థియేట్రికల్ బిజినెస్ 22 కోట్ల దాకా జరిగింది కాబట్టి ఇంకా రాబట్టుకోవాల్సింది చాలా ఉంది. ఫీల్ గుడ్ స్టోరీనే అయినప్పటికీ నెరేషన్ బాగా స్లోగా ఉండటంతో చివరిదాకా ఒకే రకమైన కనెక్టివిటీ లేకపోవడం జానుకు కొద్దివరకు మైనస్ గా మారింది. ఒరిజినల్ వెర్షన్ నే ఏ మార్పులు లేకుండా దర్శకుడు ప్రేమ్ కుమార్ తీసినప్పట్టికి ఎమోషన్ ని బలంగా రిజిస్టర్ చేయడంలో ఎక్కడో తడబాటుకు గురి కావడంతో పబ్లిక్ టాక్ ఫాస్ట్ గా బయటికి వెళ్లడం లేదు. సున్నితమైన కథాంశాలను ఇష్టపడే వాళ్లకు బాగానే కనెక్ట్ అవుతున్న జాను సామాన్య ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించబోతోందనే దాని మీద మున్ముందు వసూళ్లు పెరగడమా తగ్గడమా ఉంటుంది. గోవింద్ వసంత్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచిన జాను ఏరియాల వారి వసూళ్లు ఈ విధంగా ఉన్నాయి
AREA | SHARE |
నైజాం | 0.8cr |
సీడెడ్ | 0.28cr |
ఉత్తరాంధ్ర | 0.31cr |
గుంటూరు | 0.24cr |
క్రిష్ణ | 0.15cr |
ఈస్ట్ గోదావరి | 0.17cr |
వెస్ట్ గోదావరి | 0.09cr |
నెల్లూరు | 0.06cr |
Total Ap/Tg | 2.10cr |
– Below Average Opening
Jaanu Public Talk :