iDreamPost
android-app
ios-app

Akhanda : బాలయ్య దిగితే ఇంకా రచ్చే

  • Published Oct 20, 2021 | 7:31 AM Updated Updated Oct 20, 2021 | 7:31 AM
Akhanda : బాలయ్య దిగితే ఇంకా రచ్చే

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అఖండ రిలీజ్ డేట్ మరికొద్ది రోజుల్లో ఫైనల్ చేయబోతున్నారు. నవంబర్ విడుదలకు అవకాశం లేకపోవడంతో డిసెంబర్ మీదే కన్నేశారు. ప్రస్తుతం ఎప్పుడు వస్తే బాగుంటుందా అనే కోణంలో చర్చలు జరుగుతున్నాయట. డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాత సన్నహితుల చెబుతున్న సమాచారం మేరకు డిసెంబర్ 24 బాగుంటుందని ప్రాధమికంగా అనుకున్నట్టు తెలిసింది. అయితే ఆ డేట్ ఆల్రెడీ శ్యామ్ సింగ రాయ్ కోసం నాని లాక్ చేసుకున్నాడు. దీనికి సరిగ్గా వారం ముందు అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమా పుష్ప పార్ట్ 1 వస్తుంది. ఇంత టైట్ షెడ్యూల్ లో అఖండ దిగితే రచ్చ గ్యారెంటీ.

ప్రస్తుతం అఖండ పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉంది. ఫైనల్ కాపీని త్వరలో సిద్ధం చేయబోతున్నారు. నిజానికి డిసెంబర్ 3 అనుకూలంగా కనిపిస్తున్నప్పటికీ ఎందుకీ ఆ తేదీ మీద బాలయ్య అంతగా ఆసక్తి చూపించడం లేదని తెలిసింది. క్రిస్మస్ సెలవులు అయితేనే వర్కౌట్ చేసుకోవచ్చని యూనిట్ కూడా అభిప్రాయపడుతోందట. రవితేజ ఖిలాడీ డిసెంబర్ 10కి అనుకుంటున్నారు. తనతో ఫేస్ టు ఫేస్ పోటీ చేస్తే సమస్యేమీ ఉండదు. ఎటొచ్చి 24కే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. రకరకాల కోణాలలో ఇవన్నీ విశ్లేషించుకుంటున్నారు. సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ రాధే శ్యామ్ లు వస్తున్నాయి కాబట్టి పంపిణీదారులు సైతం ఆ సీజన్ ని ఒప్పుకోరు.

మూడు డిజాస్టర్ల తర్వాత కూడా అఖండ మీద అభిమానులు చాలా అంచనాలు పెట్టుకున్నారు. దానికి తగ్గట్టే ఫస్ట్ లుక్ లు టీజర్ వచ్చాయి కాబట్టి బిజినెస్ క్రేజీగా జరిగింది. ఆచార్య ఎలాగూ ఫిబ్రవరి 4కి షిఫ్ట్ అయిపోయింది కనక ఇబ్బంది లేదు. ఒకవేళ అఖండ డిసెంబర్ ని మిస్ చేసుకుంటే జనవరిని కూడా వదిలేయాల్సి ఉంటుంది. అంటే లేట్ చేయకుండా డిసెంబర్ కే ఫిక్స్ చేయబోతున్నారు. శ్యామ్ సింగ రాయ్ డిఫరెంట్ జానర్ కాబట్టి దాని కాంపిటీషన్ ఇబ్బంది పెట్టదు. సింహా లెజెండ్ తర్వాత హ్యాట్రిక్ కాంబోతో బోయపాటి శీను చేస్తున్న ఈ మసాలా కమర్షియల్ డ్రామాకు తమన్ సంగీతం సమకూర్చారు

Also Read : Romantic : సీనియర్ VS జూనియర్ పోటీ : ఇద్దరికీ హిట్టు కావాలి

Jojobet GirişBetcioivermectin tabletpokerklaspokerklasMadridbetmeritbetCasibom GirişmeritbetpokerklasTophillbetmarsbahis girişJojobet GirişcasibomCasibom GirişMarsbahis GirişHoliganbetbetebetHoliganbetMarsbahis Giriş