iDreamPost
iDreamPost
న్యాచురల్ స్టార్ నాని మరో డైరెక్ట్ ఓటిటి రిలీజ్ టక్ జగదీష్ ఊహించని ఫలితాన్నే ఇచ్చింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ సినిమాకు వచ్చినన్ని కామెంట్లు సెటైర్లు ఇంకే నాని మూవీకి రాలేదన్నది వాస్తవం. సెంటిమెంట్ డ్రామా ఎక్కువవ్వడంతో పాటు ఎప్పుడో తొంభైల నాటి ఫ్యామిలీ ఫార్ములాతో దర్శకుడు శివ నిర్వాణ దీన్ని రూపొందించిన తీరు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేదు. దీనికి ముందు వి ఇంతకన్నా దారుణమైన రిజల్ట్ ని అందుకోవడం అభిమానులు ఎవరూ మర్చిపోలేదు. సరే వీటి సంగతలా ఉంచితే నానికి ఇప్పుడో బ్లాక్ బస్టర్ చాలా అవసరం. తన మార్కెట్ కు రేంజ్ కు తగ్గ హిట్ అందుకుని చాలా గ్యాప్ వచ్చేసింది.
2017లో ఎంసిఎ మిడిల్ క్లాస్ అబ్బాయి నానికి చివరి కమర్షియల్ సక్సెస్. ఆ తర్వాత కృష్ణార్జున యుద్ధం డిజాస్టర్ కాగా నాగార్జునతో ఏరికోరి మరీ చేసిన దేవదాస్ ఎవరికీ ఉపయోగపడలేదు. జెర్సీ గొప్ప ప్రశంసలు అందుకుంది కానీ ట్రేడ్ లెక్కల్లో చూసుకుంటే దీన్ని సూపర్ హిట్ అనలేని పరిస్థితి. ఇక గ్యాంగ్ లీడర్ సంగతి తెలిసిందే. అంచనాలు మొత్తం తలకిందులు చేసింది. ఇప్పుడు వి, టక్ జగదీష్ లు ఇలా అయ్యాయి. సో మొత్తం చూసుకుంటే ఒక సాలిడ్ బ్లాక్ బస్టర్ నానికి దక్కి సుమారు ఐదేళ్ళు అవుతోంది. అందుకే ఇప్పుడు శ్యామ్ సింగ రాయ్ మీద అమాంతం బరువు పెరిగిపోతోంది. దానికి కారణాలు లేకపోలేదు.
డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన శ్యామ్ సింగ రాయ్ కు బడ్జెట్ చాలా అయ్యింది. లాక్ డౌన్ డిలేతో పాటు వర్షానికి సెట్లు డ్యామేజ్ కావడం మళ్ళీ వాటిని వేయాల్సి రావడం లాంటి అదనపు భారాలు నిర్మాత మీద పడ్డాయి. కోల్కతా బ్యాక్ డ్రాప్ లో ఇందులో పవర్ ఫుల్ పీరియాడిక్ డ్రామా కూడా ఉంటుందట. సాయి పల్లవి, కృతి శెట్టి లాంటి క్యాస్టింగ్ తో చాలా రిచ్ గా సెట్ చేశారు. నాని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ఈ సినిమా మీద. డిసెంబర్ లో థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న నిర్మాతలు పోటీ లేని టైంలో బరిలో దింపాలని చూస్తున్నారు. మరి ఇంత అంచనాలు మోస్తున్న శ్యామ్ సింగ రాయ్ నానికి ఎలాంటి బ్రేక్ ఇస్తుందో
Also Read : పరిశ్రమలో విభేదాలు అపార్థాలు