iDreamPost
android-app
ios-app

ప్రభాస్ VS అక్షయ్ – పోటీ బాగుంది

  • Published Sep 27, 2021 | 6:04 AM Updated Updated Sep 27, 2021 | 6:04 AM
ప్రభాస్ VS అక్షయ్ – పోటీ బాగుంది

నిన్నటి నుంచి మొదలైన రిలీజ్ డేట్ల వరద ఇవాళ కూడా కొనసాగుతోంది. బాలీవుడ్ నిర్మాతలు ఎక్కడ డేట్లు మిస్ అవుతాయో అని పోటీ పడి మరీ ప్రకటనలు ఇచ్చేస్తున్నారు. ఇందాకా ప్రభాస్ ఆది పురుష్ విడుదలను యూనిట్ అధికారికంగా అనౌన్స్ చేసింది. 2022 ఆగస్ట్ 11న థియేటర్లలోకి దీన్ని తీసుకురాబోతున్నట్టు చెప్పేశారు. అదే రోజు అక్షయ్ కుమార్ రక్షా బంధన్ కూడా ఆల్రెడీ లాక్ అయ్యి ఉంది. అయిదారు రోజుల పాటు వచ్చే సుదీర్ఘమైన వీకెండ్ ని టార్గెట్ చేసుకుని ఇలా ప్లాన్ చేసుకున్నారన్న మాట. ఈ లెక్కన సలార్ 2023కి షిఫ్ట్ అయిపోతుంది. ఎందుకంటే జనవరిలో రాధే శ్యామ్ వస్తుంది కనక ఆది పురుష్ తో కలిపి రెండు సినిమాలు అవుతాయి.

ప్రస్తుతం ఆది పురుష్ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో ఉంది. దర్శకుడు ఓం రౌత్ కీలకమైన సన్నివేశాలు చితీకరిస్తున్నారు. సైఫ్ అలీ ఖాన్ తో పాటు మరో ప్రధాన పాత్ర పోషిస్తున్న కరీనా కపూర్ ఇందులో పాల్గొంటున్నారు. నిన్న ప్రభాస్ తెప్పించిన బిర్యాని ఫోటోలకు ఈ జంట షేర్ చేయడం ఇప్పటికే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. రామాయణ గాధను సరికొత్త తరహాలో భారీ విజువల్ ఎఫెక్ట్స్ లో చూపించబోతున్న ఆది పురుష్ లో సైఫ్ రావణుడిగా కనిపించనున్నాడు. సుమారు నాలుగు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్ లో ఇది రూపొందనుంది. ఇంకా ఏడాది టైం ఉన్నప్పటికీ టాకీ పార్ట్ వేగంగా తీస్తున్నారు.

విజువల్ ఎఫెక్ట్స్ కోసం సుమారుగా ఆరు నెలలకు పైగానే ఆది పురుష్ కు అవసరం అయ్యేలా ఉంది. కృతి సనన్ సీతగా నటిస్తుండగా కీలకమైన ఇతర క్యాస్టింగ్ ని ఇంకా రివీల్ చేయలేదు. ఇక సలార్ విషయానికి వస్తే ఇది కూడా సమాంతరంగా షూట్ జరుపుకుంటోంది కానీ విడుదలకు తొందరపడే అవసరం లేదు. ఒకే ఏడాదిలో ప్రభాస్ సినిమాలు రెండు కంటే ఎక్కువ రిలీజ్ చేయలేరు. అక్షయ్ కుమార్ రక్షా బంధన్ బడ్జెట్ పరంగా కాన్సెప్ట్ పరంగా ఆది పురుష్ కి సమాంతర పోటీ అని చెప్పలేం కానీ నార్త్ లో ప్రభావం అయితే ఉండకపోదు. మొత్తానికి మహారాష్ట్ర థియేటర్లు తెరవడం ఏమో కానీ రిలీజుల హడావిడి మాత్రం భలే జోరుగా ఉంది

Also Read : బిజినెస్ మేన్ చిత్ర నిర్మాత RR వెంకట్ ఇక లేరు