ఆంధ్రప్రదేశ్ లో ఐటీ దాడులు అవినీతి జలగల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. తాజాగా పలమనేరు SKS జాఫర్ ట్రాన్స్పోర్ట్ ఆఫిస్ పై ఐటీ శాఖ సోదాలు నిర్వహిస్తుంది.. ఈరోజు ఉదయం నుండి జాఫర్ ఆఫీస్ లో సోదాలు జరుగుతున్నాయి.
గతంలో లారీ డ్రైవర్ గా ఉన్న జాఫర్ తక్కువ కాలంలోనే ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ నిర్వహించే స్థాయికి ఎదిగారు. దీంతో ఐటీ శాఖ అధికారుల కన్ను జాఫర్ పై పడింది. సోదాల్లో భాగంగా కీలక పత్రాలను IT శాఖాధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా టీడీపీ నేతల ఇళ్ళు, వారి అనుచరులపై IT అధికారులు దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వారిపై ఐటీ శాఖ దాడులు చేస్తుందని పలువురు టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు.
కానీ జాఫర్ మొదటినుండి వైసీపీ ఫాలోవర్ గా ఉన్నాడు. ఇప్పుడు అతనిపై కూడా ఐటీ దాడులు జరగడం గమనార్హం. దీంతో కొందరు టీడీపీ నేతలు చెబుతున్న వాదనల్లో నిజం లేదని రుజువైంది.. టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఐటీ దాడులు జరుగుతాయన్న వాదనకు చెక్ పెడుతూ పార్టీలతో సంబంధం లేకుండ ఐటీ శాఖ దాడి చేస్తుందని, SKS జాఫర్ ట్రాన్స్ పోర్ట్ పై జరిగిన ఐటీ సోదాలతో స్పష్టం అయ్యిందని పలువురు చర్చించుకుంటున్నారు.