iDreamPost
android-app
ios-app

నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లిన PSLV C – 49 రాకెట్‌

నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లిన PSLV C – 49 రాకెట్‌

ఇస్రో ఖాతాలో మరో విజయం

ఇస్రో ఖాతాలో మరో విజయం చేరింది. ఈరోజు మధ్యాహ్నం శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి PSLV C – 49 రాకెట్‌ను విజయవంతంగా ఇస్రో బృందం ప్రయిగించింది. PSLV C – 49 రాకెట్ ద్వారా 10 ఉపగ్రహాలను శాస్త్రవేత్తలు నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. భారత్‌కు చెందిన ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌ (EOS -01) తో పాటుగా మరో 9 విదేశీ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.

EOS -01 ఎర్త్ శాటిలైట్ ద్వారా వ్యవసాయం, అడవులు, ప్రకృతి వైపరీత్యాలను అధ్యయనం చేయనున్నారు. మొదట ఈ ప్రయోగాన్ని మార్చి 12న నిర్వహించాలని అనుకున్నా కరోనా లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా వేశారు. తొలుత శాస్త్రవేత్తలు 3:02 నిమిషాలకు PSLV C – 49 రాకెట్ ప్రయోగించాలని భావించినా భారీ వర్షం కారణంగా వీలుపడలేదు. దాంతో పది నిమిషాలు ఆలస్యంగా 3:12కు పీఎస్ఎల్‌వీ సి-49 నింగిలోకి దూసుకెళ్లింది.కరోనా నేపథ్యంలో శాస్త్రవేత్తలను మినహా షార్‌లోనికి ఎవరినీ అనుమతించలేదు.