Idream media
Idream media
కరోనా వైరస్ అభివృద్ధి చెందిన దేశమైన ఇజ్రాయెల్‌ను చుట్టుముడుతోంది. సామాన్యుల నుంచి ప్రభుత్వ పెద్దల వరకూ ఎవరినీ వదలడంలేదు. తాజాగా ఇజ్రాయెల్ ఆరోగ్యశాఖ మంత్రి యాకోవ్ లిట్ట్‌మన్‌కు కరోనా వైరస్ సోకింది. ఆయన భార్యకు కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఇద్దరినీ ఐసోలేషన్‌లో ఉంచారు. ఆయనతో ఉన్న ఇతర ఉన్నతాధికారులను కూడా సెల్ఫ్ క్వారంటైన్‌లెకి పంపారు.
ఇప్పటికే ఆ దేశ ప్రధాని బెంజిమెన్ నెతన్యహు కరోనా వైరస్ భయాందోళన నేపథ్యంలో సెల్ఫ్ క్వారంటైన్‌కు వెళ్లారు. ఆయన వ్యక్తిగత సహాయకుడికి కరోనా పాజిటివ్ రావడంతో ఆయన ముందు జాగ్రత్తగా క్వారంటైన్‌లోకి వెళ్లారు. ప్రస్తుతం ఆయనకు కరోనా నెగిటివ్ అని తేలింది.
ఇజ్రాయెల్‌లో ఇప్పటి వరకూ 6,211 మందికి కరోనా వైరస్ సోకింది. దేశంలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ మహమ్మరి వల్ల ఇప్పటి వరకూ 32 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా కట్టడికి ప్రజల సంచారంపై పలు ఆంక్షలు విధించింది.