Idream media
Idream media
రామయ్య విగ్రహం ధ్వంసం!!
రేపే ఇళ్లపట్టాల పంపిణీకి జగన్ రాక!!
ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు కుట్ర?
రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జిల్లాకు వచ్చి వేలాదిమంది లభ్డిదారులకు ఇళ్ల పట్టాలు ఇచ్చి, సంబరాలు చేసుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో ఆ సంతోష సమయాన్ని డిస్టర్బ్ చేసేందుకా అన్నట్లుగా ఓ అవాంఛనీయ ఘటన విజయనగరం జిల్లాలో చోటు చేసుకుంది. నెల్లిమర్ల మండలం రామతీర్థం గ్రామంలోని కోదండరాముల వారి ఆలయంలోని శ్రీరాముని ఆలయం మీద కొందరు గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. శ్రీరాముని శిరస్సును కొందరు దుండగులు మంగళవారం ఖండించారు. రామతీర్థం గ్రామంలో సీతారామ స్వామి ఆలయం ఉంది. అదే రెండో భద్రాద్రిగా విలసిల్లుతున్నది. ప్రధాన పూజలు జాతరలు అన్ని ఇక్కడే జరుగుతాయి. అయితే గ్రామం సమీపంలో బోడి కొండ అనే గుట్టమీద ఇంకో కోదండ రాముని ఆలయం ఉంది. ఈ ఆలయంలోని విగ్రహాన్నీ దుండగులు ధ్వంసం చేశారు.
విషయం తెలుసుకున్న భక్తులు గుట్టమీదకు తరలి వస్తుండగా పోలీసులు వారిని నియంత్రిస్తూ పరిస్థితిని చక్కదిద్దుతున్నారు. ఇప్పటికే ఎస్పీ బి.రాజకుమారి ఆలయాన్ని సందర్శించి పరిస్థితిని అంచనా వేశారు. గుడి పరిసరాలను చూసి దుండగుల ఆనవాళ్లు గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.
రాములోరి ఆలయాన్ని, విగ్రహాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇది దుండగుల పనియని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ప్రత్యేక పోలీసు టీంను ఏర్పాటు చేసామని, క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోందని చెప్పారు. నిందితులను వెంటనే పట్టుకుని కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు.
కుట్ర ఉందా ?
రేపు బుధవారం ముఖ్యమంత్రి జగన్ జిల్లాకు వస్తున్నారు. రాష్ట్రంలోనే అతిపెద్ద ఇళ్ల పట్టాల లే అవుట్ గా రూపొందించిన అయిన గుంకలాం లే అవుట్ లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని లబ్ధిదారులకు పట్టాలు అందజేస్తారు. దీనికోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. పోలీసులు, ఇతర అధికార యంత్రాగం, మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్యేలు ఈ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఇలాంటి సంతోష సమయంలో ఇలా ఆ ప్రాంతం నుండి 10 కిలోమీటర్లు దూరంలో ఉన్న రాముని ఆలయంలో అపచారానికి పాల్పడింది ఎవరా అన్నదానిపై అనుమానాలున్నాయి. కావాలనే ఎవరో దుండగులు పనిగట్టుకుని జగన్ ప్రభుత్వాన్ని అప్రదిష్టపాల్జేసేందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అన్నదానిపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఎంపీ చంద్రశేఖర్ , స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు ఆలయాన్ని సందర్శించి పరిస్థితిని తెలుసుకున్నారు.