iDreamPost
android-app
ios-app

పవర్ స్టార్ తో రెండో మూవీ ?

  • Published Apr 25, 2021 | 9:35 AM Updated Updated Apr 25, 2021 | 9:35 AM
పవర్ స్టార్ తో రెండో మూవీ ?

ఏంటో పవన్ కళ్యాణ్ నిజంగా ఒప్పుకుంటున్నారో లేక నిర్మాతల తాలూకు టీమ్స్ ఇస్తున్న లీకులో అర్థం కావడం లేదు కానీ పవర్ స్టార్ చేయబోయే సినిమాల లిస్టు అంతకంతా పెరుగుతూ పోతోంది. ఇప్పటికే నాలుగు క్యూలో ఉన్నాయి. ఇటీవలే నిర్మాత జె పుల్లారావు తాను కూడా ఓ మూవీ చేయబోతున్నట్టు ప్రకటించారు. తాజాగా దిల్ రాజు కు మరో ఛాన్స్ దక్కినట్టు వస్తున్న వార్త ఫిలిం నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే వకీల్ సాబ్ రూపంలో భారీ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న దిల్ రాజు మంచి లాభాలను అందుకున్నారు. థియేట్రికల్ బిజినెస్ కు తగ్గ రెవెన్యూ ఇంకా పూర్తి స్థాయిలో రానప్పటికీ ప్రాఫిటబుల్ వెంచర్ గానే మిగిలిందని ట్రేడ్ టాక్.

మహర్షి తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న దర్శకుడు వంశీ పైడిపల్లిని పవన్ తో జత చేసేందుకు దిల్ రాజు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఇన్ సైడ్ న్యూస్. అంత పెద్ద హిట్టు కొట్టిన తర్వాత కూడా వంశీ ఇప్పటిదాకా కొత్త సినిమా మొదలుపెట్టకపోవడం ఆశ్చర్యకరమే. మహేష్ బాబుతోనే మరొకటి చేద్దామని అనుకున్నా స్క్రిప్ట్ మీద ఏకాభిప్రాయం రాకపోవడం వల్ల అది కాస్తా కార్యరూపం దాల్చలేకపోయింది. అప్పటి నుంచి పైడిపల్లి ఖాళీగానే ఉన్నాడు. ఏదో వెబ్ సిరీస్ అన్నారు కానీ దాని గురించి ఎలాంటి ఊసే లేదు. అల్లు అరవింద్ నిర్మాతగా ఓ ప్రాజెక్ట్ ఉండొచ్చన్నారు కానీ అదీ సైలెంట్ అయ్యింది.

పవన్ ఇంత స్పీడ్ గా సినిమాలు ఒప్పుకోవడానికి బహుశా వకీల్ సాబ్, అయ్యప్పనుం కోషియం రీమేక్ లే కారణం అయ్యుంటాయి. చాలా తక్కువ వ్యవధిలో ఎక్కువ బడ్జెట్ లేకుండా కనీసం 90 నుంచి 100 కోట్ల మధ్య బిజినెస్ జరిగేలా వాటి నిర్మాతలు వేసుకున్న ప్లాన్లు బాగా వర్కౌట్ అవ్వడంతో నెల నుంచి నెలన్నర కాల్ షీట్స్ లో ఓ సినిమా పూర్తి చేయొచ్చనే క్లారిటీ పవన్ కు వచ్చేసింది. తన రెమ్యునరేషన్ మినహాయిస్తే పైన చెప్పినవాటికి మహా అయితే ఇరవై కోట్లకు మించి ఖర్చు కాదు. అందులోనూ తక్కువ టైంలోనే ఎక్కువ సినిమాలు చేసే అవకాశం ఉండటం కూడా ఒక కారణం. చూద్దాం అఫీషియల్ అయ్యేదాకా