iDreamPost
android-app
ios-app

TDP, Atchennaidu – రావాలనుకుంటే టిడిపికి కొత్త అధ్యక్షుడు వస్తాడా?

TDP, Atchennaidu – రావాలనుకుంటే టిడిపికి కొత్త అధ్యక్షుడు వస్తాడా?

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి కొత్త అధ్యక్షుడి అవసరం ఉందా…? ఎన్నో అంచనాలతో బాధ్యతలు తీసుకున్న అచ్చెన్నాయుడు సమర్థవంతంగా పార్టీని ముందుకు నడిపించలేకపోతున్నారా…? చంద్రబాబు నాయుడు తర్వాత అధ్యక్షుడిని చేస్తే ఎవరిని చేయాలి…? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీలో కుప్పం ఎన్నికల తర్వాత ఎక్కువగా వినపడే ప్రశ్నలివి. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ రోజురోజుకీ ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడుని మార్చకపోతే మాత్రం భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది అనే అభిప్రాయం చాలా మంది కార్యకర్తలు వ్యక్తం చేస్తున్నారు.

కొంతమంది సమర్థవంతమైన నాయకులను తెలుగుదేశం పార్టీ కాలక్రమేణా దూరం చేసుకుంటూ… పార్టీలో ముందునుంచి ఉన్న నాయకులను కీలక పదవులు ఇచ్చి కొనసాగించడం ఇబ్బంది పెడుతున్న అంశం. ఇప్పుడు అచ్చెన్నాయుడు విషయంలో కూడా దాదాపు అదే జరిగింది అనే భావన ఉంది. కొన్ని దశాబ్దాల నుంచి అచ్చెన్నాయుడు కుటుంబం తెలుగుదేశం పార్టీలో కీలక పదవులు నిర్వహిస్తూ వచ్చింది. ఎర్రన్నాయుడు గాని  అచ్చెన్నాయుడు గాని అలాగే రామ్మోహన్ నాయుడు గానీ ప్రస్తుతం రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే గా ఉన్న ఆదిరెడ్డి భవాని గాని వీళ్ళందరూ కూడా కీలక పదవులు నిర్వహించిన వారే.

అయినా సరే చంద్రబాబు నాయుడు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు ని ఎంపిక చేయడం పట్ల ఇప్పటికీ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అచ్చెన్నాయుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ క్షేత్ర స్థాయిలో ఎన్నో ఇబ్బందులు పడింది. కొంతమంది నాయకుల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించే విషయంలో సమర్థవంతంగా వ్యవహరించ లేకపోవడం… ప్రధానంగా విజయవాడ లాంటి నగరంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని ఏకతాటి మీదకు తీసుకొచ్చే ప్రయత్నం సమర్థవంతంగా చేయలేకపోవడం, తెలుగుదేశం పార్టీని బాగా ఇబ్బంది పెడుతున్న అంశంగా చెప్పుకోవాలి.

Also Read : కూలిన జేసీ సోదరుల చివరి కోట .. సొంత ఊరిలో ఓటమి ..

అలాగే విశాఖపట్నంలో స్థానిక సంస్థల ఎన్నికలలో కొంతమంది కీలక నాయకులను గాడిలో పెట్టే విషయంలో అచ్చెన్నాయుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉండి సమర్థవంతంగా వ్యవహరించ లేకపోవడంతో చాలా మంది నాయకులు తెలుగుదేశం పార్టీకి పనిచేయడానికి ఆసక్తి చూపించలేదు. పంచాయతీ ఎన్నికల విషయంలో తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయి నాయకత్వానికి దశ దిశ నిర్దేశించే విషయంలో అచ్చెన్నాయుడు సమర్థవంతంగా వ్యవహరించలేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అలాగే పరిషత్ ఎన్నికల విషయంలో కూడా కొంతమంది నాయకులు చంద్రబాబు మాట వినక పోయినా సరే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉండి కనీసం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేయలేకపోయారు.

ఇక నెల్లూరు జిల్లా ఇన్చార్జిగా ఉన్న అచ్చెన్నాయుడు నెల్లూరు కార్పొరేషన్ కి జరిగిన ఎన్నికల్లో కనీసం ఒక్క సీటు కూడా గెలవలేక పోవడం తెలుగుదేశం పార్టీని అవమానపరిచింది అనే చెప్పాలి. అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకుడు తాను చెప్పిన రెండు వార్డులలో పార్టీ ఓడిపోతే అర గుండు చేయించుకుని తిరుగుతానని ప్రకటన చేసి మాట మీద నిలబడ్డాడు. ఆయనలో ఉన్న పట్టుదల కూడా అచ్చం నాయుడులో లేకపోయింది అనే భావన చాలా మందిలో వ్యక్తమైంది. పదవులు ఇచ్చే విషయంలో చిన్న చిన్న పదవులకు సంబంధించి కూడా వివాదాలు వస్తున్నా అచ్చెన్నాయుడు జాగ్రత్తగా వ్యవహరించ లేకపోతున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆయనను పక్కన పెడతారా లేదా అనే దానిపైనే కాస్త ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

Also Read : Ycp Record Victories..రికార్డు విజ‌యాలు వైసీపీ సొంతం

టిడిపిలో మెజారిటీ నాయకులు ఆయన్ను పక్కన పెట్టి కొత్త బీసీ నేతకు పదవి ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. ఉభయగోదావరి జిల్లాలకు చెందిన నాయకుడిని లేదా రాయలసీమ ప్రాంతానికి చెందిన బీసీ నాయకుడుని చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకు వస్తే మంచి ఫలితం ఉంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులు పార్టీ కోసం పని చేయడానికి ముందుకు వస్తున్న సరే చంద్రబాబు నాయుడు నమ్మకస్తులు అనే కారణంతో కొంతమందిని ముందుకు నడిపిస్తున్నారు.

దీంతో చాలామంది పార్టీ కోసం పని చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించకపోవడం తో పార్టీ రోజురోజుకి కూడా ప్రజలకు దూరం అవుతుంది అని ఆవేదన కార్యకర్తలకు ఉంది. అలాగే యువ నాయకులను తెలుగుదేశం పార్టీ ముందుకు నడిపించలేకపోవడంతో సీనియర్లు చెప్పిందే వేదంగా తెలుగుదేశం పార్టీలో పరిస్థితి మారిపోతుంది. కాబట్టి తర్వాత చంద్రబాబు ఎంపిక చేసే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఖచ్చితంగా బీసీ నేత వుండాలని పార్టీ లో ఉన్న చాలా మంది బీసీ నేతలు ఇబ్బంది పడకుండా స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితి ఉండాలి అంటే కచ్చితంగా అటువంటి నాయకుడిని ఎంపిక చేయాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Also Read : TDP, Penukonda Municipality – అనంతపురం టీడీపీపై పెను’బండ’