ధూల్ పేట్ తరహాలో శింబు సినిమా

హాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ఫ్రాన్సిస్ కొప్పుల ది గాడ్ ఫాదర్ ని స్ఫూర్తిగా తీసుకుని మణిరత్నం ఆవిష్కరించిన కమల్ హాసన్ నాయకుడు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ క్లాసిక్. అదే ఇన్స్ పిరేషన్ తో రామ్ గోపాల్ వర్మ గాయం, సర్కార్, కంపెనీ, సత్య లాంటి మాస్టర్ పీసులను ప్రేక్షకులకు కానుకగా ఇచ్చాడు.

హాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ఫ్రాన్సిస్ కొప్పుల ది గాడ్ ఫాదర్ ని స్ఫూర్తిగా తీసుకుని మణిరత్నం ఆవిష్కరించిన కమల్ హాసన్ నాయకుడు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ క్లాసిక్. అదే ఇన్స్ పిరేషన్ తో రామ్ గోపాల్ వర్మ గాయం, సర్కార్, కంపెనీ, సత్య లాంటి మాస్టర్ పీసులను ప్రేక్షకులకు కానుకగా ఇచ్చాడు.

మాములుగా గ్యాంగ్ స్టర్ డ్రామాలంటే ఫార్మాట్ ఒకేలా ఉంటుంది. దాన్ని దర్శకులు ఎంత వైవిధ్యంగా డ్రామాను జొప్పించి మెప్పిస్తారనే దాని మీదే సక్సెస్ ఆధారపడి ఉంటుంది. హాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ఫ్రాన్సిస్ కొప్పుల ది గాడ్ ఫాదర్ ని స్ఫూర్తిగా తీసుకుని మణిరత్నం ఆవిష్కరించిన కమల్ హాసన్ నాయకుడు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ క్లాసిక్. అదే ఇన్స్ పిరేషన్ తో రామ్ గోపాల్ వర్మ గాయం, సర్కార్, కంపెనీ, సత్య లాంటి మాస్టర్ పీసులను ప్రేక్షకులకు కానుకగా ఇచ్చాడు. అలా అని ఇది అందరికీ వచ్చే విద్య కాదు తెలివిగా ఆలోచించే. మేధావులైన డైరెక్టర్లు మాత్రమే వీటిని తెరమీద గొప్పగా ఆవిష్కరించగలరు.అందులో గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఒకరు.

మ్యాటర్ లోకి వెళ్తే ఈ నెల 17న శింబు ది లైఫ్ అఫ్ ముత్తు విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. తమిళ వెర్షన్ కంటే రెండు రోజులు ఆలస్యంగా రిలీజ్ చేస్తున్నారు. ట్రైలర్ చూశాక ఈ జానర్ ని ఇష్టపడే ఆడియన్స్ కి ఆసక్తి కలిగింది కానీ మొత్తంగా చూస్తే 2006లో వచ్చిన ధనుష్ పుదుపేట్టై ఛాయలు స్పష్టంగా కనిపించాయి. సెల్వ రాఘవన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ థియేటర్లలో సోసోగా ఆడింది కానీ ఆ తర్వాత జనం ఎగబడి చూసి హారతులు పట్టేశారు. తెలుగులో ధూల్ పేట్ టైటిల్ తో వదిలితే మనవాళ్ళు అంతగా పట్టించుకోక పోవడంతో వారం దాటకుండానే వెళ్లిపోయింది. డబ్బింగ్ వెర్షన్ ఎన్నో ఏళ్ళు అందుబాటులో లేక కొన్ని నెలల క్రితం ప్రైమ్ లో వచ్చింది

ఒక సామాన్య యువకుడు ఉపాధి కోసం నగరానికి వచ్చి అమాయకత్వం వల్ల మొదట ఇబ్బంది పడి అవమానం జరిగాక తనలో మరో మనిషిని బయటికి తీసుకొచ్చి నేర సామ్రాజ్యంలో కిరాతకుడిగా మారడం అందులో మెయిన్ పాయింట్. శింబు ముత్తులో సైతం అవే షేడ్స్ కనిపిస్తున్నాయి. దానికి తోడు ఇది పార్ట్ వన్నే. రెండో భాగం కూడా ఉంటుందట. సరే కథ పాతదే అయినా గౌతమ్ మీనన్ టేకింగ్ మీద అభిమానులకు గట్టి నమ్మకముంది. ఒకవేళ ఆయనలో ఒరిజినల్ క్రియేటర్ బయటికొచ్చి మేజిక్ చేస్తే సరే. లేదా మూడు గంటల నిడివున్న ముత్తుని భరించడం కష్టమే అవుతుంది. చూద్దాం. ఇవాళ ఉదయం పూర్తయిన తమిళ ప్రీమియర్ల టాక్ పాజిటివ్ గానే ఉంది

Show comments