iDreamPost
android-app
ios-app

బిగ్ బాస్ 8కు హూస్ట్‌గా కుర్ర హీరో ఎంట్రీ.. ఇక రచ్చ రచ్చే!

  • Published Aug 07, 2024 | 2:25 PM Updated Updated Aug 07, 2024 | 2:25 PM

Bigg Boss Season 8: బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ రియాల్టీ షో గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. బిగ్ బాస్ హౌజ్ లో కొంతమంది ఎంట్రీ ఇచ్చి గేమ్స్, టాస్కులు, కాంట్రవర్సీలు, గిల్లి కజ్జాలు ఇలా వంద రోజులు అలరిస్తుంటారు. పలు భాషల్లో వస్తున్న బిగ్ బాస్ కి స్టార్ హీరోలు వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు.

Bigg Boss Season 8: బుల్లితెర ప్రేక్షకులకు బిగ్ బాస్ రియాల్టీ షో గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. బిగ్ బాస్ హౌజ్ లో కొంతమంది ఎంట్రీ ఇచ్చి గేమ్స్, టాస్కులు, కాంట్రవర్సీలు, గిల్లి కజ్జాలు ఇలా వంద రోజులు అలరిస్తుంటారు. పలు భాషల్లో వస్తున్న బిగ్ బాస్ కి స్టార్ హీరోలు వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు.

  • Published Aug 07, 2024 | 2:25 PMUpdated Aug 07, 2024 | 2:25 PM
బిగ్ బాస్ 8కు హూస్ట్‌గా కుర్ర హీరో ఎంట్రీ.. ఇక రచ్చ రచ్చే!

టెలివిజన్ రంగంలో ఇప్పటి వరకు ఎన్నో రియాల్టీ షోలు వచ్చాయి. అందులో బాగా పాపులారిటీ తెచ్చుకుంది బిగ్ బాస్ ఒక్కటే. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హూస్ట్‌గా నిర్వహిస్తున్న ఈ రియాల్టీ షో వేరే భాషల్లో మొదలు పెట్టారు. తెలుగులో కింగ్ నాగార్జున, తమిళ్‌లో విశ్వనటుడు కమల్ హాసన్, మాలయాళంలో సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడంలో కిచ్చ సుదీప్ వ్యాఖ్యాతలుగా సందడి చేస్తున్నారు. బాలీవుడ్ లో వచ్చిన క్రేజ్ మిగతా భాషల్లో కూడా వస్తుంది. తెలుగు, తమిళ్ బిగ్ బాస్ ఏడు సీజన్లు పూర్తి చేసుకొని 8వ సీజన్ మొదలు కాబోతుంది. బిగ్ బాస్ సీజన్ 8 కి సంబంధించిన ఓ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే.

హాలీవుడ్ నుంచి స్పూర్తి పొంది బాలీవుడ్ లో బిగ్ బాస్ రియాల్టీ షో ప్రారంభమైంది.ఈ షో కి సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఇక తెలుగులో బిగ్ బాస్ సీజన్ 1 కి ఎన్టీఆర్, సీజన్ 2 కి నాని హూస్ట్ గా వ్యవహరించగా మూడో సీజన్ నుంచి కింగ్ నాగార్జున హూస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తమిళంలో విశ్వనటుడు కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు కమల్ హాసన్ 7 షోలు కంటిన్యూగా కొనసాగుతూ వచ్చారు. కొద్ది రోజుల్లో  మొదలు కానున్న బిగ్ బాస్ సీజన్ 8 కు కమల్ హాసన్ హూస్ట్ గా ఉండటం లేదని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయనకు పలు సినిమా కమిట్మెంట్స్ ఉన్న కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోలీవుడ్ లో టాక్ నడుస్తుంది.

Simbu as bigg boss 8 tamil host

తమిళ బిగ్ బాస్ సీజన్ 8 కి ఎవరు రాబోతున్నారన్న విషయంపై రక రకాల చర్చలు నడుస్తున్నాయి. మొదటి నుంచి తమిళంలో వస్తున్న బిగ్ బాస్ పై పలు కాంట్రవర్సీలు వచ్చాయి.. కమల్ వాటన్నింటిని తనదైన స్టైల్లో డీల్ చేశారు. మరి కొత్త హూస్ట్ బిగ్ బాస్8 ని ఎలా ముందుకు తీసుకువెళ్తాడు?  కంటెస్టెంట్స్ తో ఎలా ఉంటాడు? గతంలో మాదిరిగా సక్సెస్ ఫుల్ గా నడిపించగలడా? అన్న సందేహాలు అందరిలో ఉండగా, తమిళ సినీ వర్గాల్లో ఓ లేటెస్ట్ అప్డేట్ సంచలనం రేపుతుంది. సీజన్ 8 కు యంగ్ సెన్సేషనల్ హీరో శింబు రాబోతున్నాడని తమిళ సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. కాకపోతే దీనిపై అఫిషియల్ గా ఎలాంటి అనౌన్స్ మెంట్ రాలేదు. ఒకవేళ శింబు హూస్ట్ గా ఉంటే వేరే లెవెల్ లో ఉంటుందని అభిమానులు అంటున్నారు. మరి ఈ విషయంపై క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు వేయిట్ చేయాల్సిందే.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetjojobet girişdeneme bonusu veren sitelerMariobetmadridbetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetcasibomcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet