iDreamPost
iDreamPost
ఇంకా నిర్మాణంలో ఉన్న దర్శకుడు శంకర్ సినిమా తాలూకు అప్డేట్లే సరిగా రావడం లేదు.ఈలోగా రామ్ చరణ్ 16వ సినిమా గురించి రకరకాల ప్రచారాలు మొదలైపోయాయి. గతంలోనే జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరికి చెర్రీ కమిట్ మెంట్ ఇచ్సిన సంగతి తెలిసిందే. యువి సంస్థ తరఫున కొన్ని నెలల క్రితమే అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చింది. అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఇది క్యాన్సిల్ అయ్యిందట. ఫైనల్ వెర్షన్ హీరోతో అందరికీ నచ్చేలా సంతృప్తికరంగా లేకపోవడంతో పెండింగ్ లో పెట్టాల్సి వచ్చిందని వినికిడి. ఇది నిజమో కాదో ఇంకా అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు కానీ రెండు మూడు రోజుల నుంచి చక్కర్లు కొడుతున్న ఈ వార్తను యూనిట్ ఖండించలేదు.
అంటే ఎంతో కొంత నిజం ఉందని ఒప్పుకున్నట్టేగానని ఓ వర్గం విశ్లేషిస్తోంది. ఇంకో వైపు దర్శకుడు నర్తన్ ఇటీవలే చరణ్ తో మీటింగ్ చేశాడు. ఓ లైన్ మీద ఇద్దరు డిస్కస్ చేసుకున్నారు. ఈ నర్తన్ ఎవరంటే కన్నడలో మఫ్టీ అనే పెద్ద హిట్ మూవీ చేశాడు. శివరాజ్ కుమార్ మెయిన్ హీరో కాగా ప్రశాంత్ నీల్ మొదటి చిత్రం ఉగ్రం హీరో శ్రీమురళి ఆయనతో పాటు కలిసి మల్టీస్టారర్ లో భాగమయ్యాడు. అప్పుడు నర్తన్ గురించి ప్రపంచానికి తెలిసింది. తర్వాత యష్ తో చేయాలని చాలా ట్రై చేశాడు కానీ సాధ్యపడలేదు. చర్చల దశ దాటి ముందుకు వెళ్లలేకపోతోంది. ఈలోగా మెగా పవర్ స్టార్ ని ట్రై చేయడం కొంత పాజిటివ్ రెస్పాన్స్ రావడం చకచకా జరిగిపోయాయి.
ఏది ఏమైనా రామ్ చరణ్ స్వయంగా క్లారిటీ ఇస్తే తప్ప వీటికి చెక్ పడదు. ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఆచార్య బ్లాక్ మార్క్ మిగిల్చింది. సో శంకర్ మూవీ ప్యాన్ ఇండియా లెవెల్ లో మరోసారి కొడుతుందనే నమ్మకంతో టీమ్ కంటే ఎక్కువగా అభిమానుల్లో ఉంది. ఇదంతా బాగానే ఉంది కానీ గౌతమ్ చెప్పిన కథ ఏ జానర్ దో బయటికి లీక్ అయితే రాలేదు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ అన్నారు కానీ క్లారిటీ లేదు. సున్నితమైన కథలను డీల్ చేసే గౌతమ్ మరి అంత ఒత్తిడితో చరణ్ లాంటి మాస్ హీరోని హ్యాండిల్ చేయగలడా అనే అనుమానాలు గతంలోనే వచ్చాయి. మరి ఈ మార్పు గురించి వీలైనంత త్వరగా క్లారిటీ ఇస్తే ఫ్యాన్స్ లో కన్ఫ్యూజన్ తగ్గుతుంది