iDreamPost
android-app
ios-app

Mp raghurama krishnam raju – ర‌ఘురామ రాజీనామా చేస్తున్నాడా?

Mp raghurama krishnam raju – ర‌ఘురామ రాజీనామా చేస్తున్నాడా?

ఇష్టం లేని కాపురం ఎన్నాళ్లు చేస్తారు. న‌చ్చితే క‌లిసిమెలిసి జీవ‌నం సాగించాలి. న‌చ్చ‌క‌పోతే ఎవ‌రి దారి వారు చూసుకోవాలి. కానీ ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు వైసీపీలోనే కొన‌సాగుతూ ఇత‌ర పార్టీల‌కు ఒత్తాసు ప‌లికేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీనిపై ఇప్ప‌టికే వైసీపీ క్ర‌మ‌శిక్ష‌ణా చ‌ర్య‌లు తీసుకుంది. స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయాల‌ని స్పీక‌ర్ కు కూడా ఫిర్యాదు చేసింది. ర‌ఘ‌రామ కృష్ణంరాజు మాత్రం వైసీపీకి రాజీనామా చేసే సాహ‌సం చేయ‌లేక‌పోతున్నారు. పార్టీ కి వ్య‌తిరేకంగా ప‌నిచేస్తూ వెన్నుపోటుదారుడిగా గుర్తింపు పొందుతున్నారు. అయితే, రఘురామ కృష్ణంరాజు తొందరలోనే రాజీనామా చేయబోతున్నార‌ని సోష‌ల్ మీడియాలో చ‌ర్చ జరుగుతోంది.

ఈనెలలోనే రఘురాజు నరసాపురం పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈమధ్యనే తిరుపతిలో పర్యటించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీనియర్ నేతలతో మాట్లాడుతూ ఇతర పార్టీల్లోని గట్టి నేతలను పార్టీలోకి చేర్చుకోవాలని చెప్పిన విషయం తెలిసిందే. ఇతర పార్టీల్లోని నేతలను బీజేపీలో చేర్చుకోవాలని చెప్పిన సందర్భంలో రఘురామరాజు పేరును షా ప్రస్తావించినట్లు ప్రచారం జరిగింది. దాంతో వైసీపీకి తిరుగుబాటు ఎంపీ గుడ్ బై చెప్పేసి బీజేపీలోకి చేరటం ఖాయమని ఊహాగానాలు మొదలైపోయాయి. మరి తెరవెనుక ఏమి జరిగిందో ఏమో కానీ సోషల్ మీడియాలో రఘురామరాజు ఈనెల 17 న కానీ లేకపోతే 25వ తేదీన కానీ రాజీనామా చేయబోతున్నట్లు చెప్పుకుంటున్నారు.

న్యాయస్థానం టు దేవ‌స్థానం పేరుతో అమరావతి జేఏసీ చేస్తున్న పాదయాత్ర ముగింపు సభ ఈనెల 17వ తేదీన తిరుపతిలో భారీఎత్తున చేయాలని ప్లాన్ జరుగుతోంది. ఆ సమయంలోనే ఎంపీ తన రాజీనామా నిర్ణయాన్ని బహిరంగసభలో ప్రకటిస్తారని సమాచారం. ఒకవేళ ఆరోజు కాకపోతే ఇదే నెల 25వ తేదీన మాజీ ప్రధానమంత్రి వాజ్ పేయ్ జయంతి సందర్భంగా ఎంపీ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా రఘురాజు ఎంపీ పదవికి రాజీనామా చేయటం వల్ల జరిగే ఉపఎన్నిక మాత్రం చాలా రసవత్తరంగా ఉంటుంది. ఆయ‌న చేజేతులా చేసుకున్న పొర‌పొట్ల వ‌ల్ల మ‌రోసారి ఆయ‌న‌కు అవ‌కాశం ద‌క్క‌క‌పోవ‌చ్చ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎంపీ రాజీనామా చేస్తే ఉపఎన్నికలు వస్తే జగన్ సత్తానా ? లేకపోతే ప్రతిపక్షాల సత్తానా ? అన్నది తేలిపోతుంది.

Also Read : ఆంధ్రప్రదేశ్ విభజన హామీలపై పార్లమెంట్ లో గళం విప్పిన వైఎస్సార్సీపీ నేత