Idream media
Idream media
రాజకీయం అంటేనే బురద చల్లుకోవడం. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వల్ల జనానికి ఒరిగేదేమీ లేదు, వినోదం తప్ప.
ప్రకాష్‌రాజ్ తెలుగువాడు కాదని కొందరు మాట్లాడుతున్నారు. వీళ్లే వేదికలు ఎక్కితే కళామ తల్లికి భాష లేదు, ఎల్లలు లేవు అని, విశ్వజనీనం అంటారు. ఎన్నికలొస్తే ప్రాంతీయత కావాలి. ఇంకా నయం, ఆయన కులాన్ని కూడా ముందుకు తీసుకురాలేదు. అదీ జరిగినా ఆశ్చర్యం లేదు.
20 ఏళ్లుగా ప్రకాష్‌రాజ్ లేకుండా తెలుగు సినిమా లేదు. అన్ని రకాల పాత్రలు చేశారు. ఆయన తెలుగువాడు కాదు అనే విషయం కూడా చాలా మంది ప్రేక్షకులకి తెలియదు. సక్సెస్ వుంది కాబట్టి ఇంత కాలం వున్నారు. వ్యాపారానికి పనికొచ్చిన ప్రకాష్ , ఎన్నికలకి ఎందుకు పనికి రాడు?
రజనీకాంత్ కూడా తమిళుడు కాదు, కానీ ఆయన పార్టీ పెట్టాలనుకున్నాడు. ముందుకు పోలేదు కానీ, పెడితే అధికారం సంగతేమో కానీ, ఆదరణ గ్యారెంటీగా వుండేది. కళకి సరిహద్దులుండవు. అమితాబ్, అమీర్‌ఖాన్ ఏ రాష్ట్రం వాళ్లో మనకి తెలియదు. ఏళ్లతరబడి చూస్తూనే వున్నాం.
సంక్లిష్టంగా , సంకుచితంగా మారిన సమాజంలో ప్రకాష్‌రాజ్ లాంటి వాళ్లు అవసరం. అభిప్రాయాలను ప్రకటించడానికి ఇపుడు ధైర్యం మాత్రమే చాలదు, సాహసం, తెగింపు కావాలి. భౌతికదాడులు చేసే సంస్కృతిలో జీవిస్తున్నాం. ప్రకాష్‌రాజ్ గెలిచినా, ఓడినా గౌరవ మర్యాదలు పెరగవు, తరగవు. తప్పుని తప్పు అని చెప్పే ఆయన లక్షణాన్నే అందరూ అభిమానిస్తారు.
ప్రకాష్‌రాజ్ వ్యక్తిత్వం స్పష్టంగా వుంది. మంచు విష్ణునే ఇంకా తండ్రి చాటు బిడ్డగా వున్నాడు. నటన, రాజకీయాలన్నీ వారసత్వపు హక్కులుగా మారితే ఎలా?
Also Read : మరో తమిళ్ హీరో – తెలుగు దర్శకుడు కాంబో ఫిక్స్