iDreamPost
iDreamPost
జనసేనాని పవన్ కళ్యాణ్ రెండు పడవల మీద ప్రయాణం సాఫీగా సాగడం లేదు. గత సాధారణ ఎన్నికలకు ముందు సినిమాలకు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించినా ఆయన మళ్లీ మొఖానికి రంగేసుకోవాల్సి వచ్చింది. వకీల్ సాబ్ సినిమా కొంత ఊరటనిచ్చింది భీమ్లా నాయక్ ఏం చేస్తుందోననే సందిగ్ధంలో ఆయనున్నారు. అదే సమయంలో రాజకీయ పయనం మాత్రం అంతంతమాత్రంగా కనిపిస్తోంది. పార్టీ ప్రభావం రానురాను కుంచించుకుపోతుండగా తాను మాత్రం సినిమా, రాజకీయాల రెండు పడవల ప్రయాణం సాగించాల్సిన స్థితిలో ఉన్నారు.
ఏపీకి నెలకోసారి పర్యాటకుడి మాదిరిగా రావడం, రెండు పొలిటికల్ స్టేట్ మెంట్స్ ఇవ్వడం పవన్ కి రివాజుగా మారింది . కానీ వాటి ప్రభావం రానురాను తగ్గిపోతున్నట్టుగా కనిపిస్తోంది. ఇటీవల జనసేనకు సంబంధించి మీడియాలో వస్తున్న కవరేజ్ దానికి నిదర్శనం పలు సమస్యలపై పవన్ ట్వీట్లకే ప్రాధాన్యతనిచ్చిన పచ్చ మీడియా కూడా ఇటీవల పెద్దగా పట్టించుకోవడం లేదు. పవన్ కి ప్రజల్లో ఆదరణ తగ్గుతున్నందున దానికి తగ్గట్టుగా ప్రయారిటీ ఇస్తున్నట్టు కొందరు భావిస్తున్నారు. తామెంతగా ఆయన్ని బలపరుద్దామని భావించినా చివరకు సొంత కులస్తుల్లోనే విశ్వాసం కల్పించలేని స్థితిలో ఉండడంతో పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరంలేదని వారంతా భావిస్తున్నట్టు సమాచారం.
సినిమాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వంతో ఏర్పడిన విబేధాలు పరిష్కారంలోనూ పవన్ పాత్ర కనిపించలేదు. తాజాగా మత్స్యకారుల సమస్య మీద నరసాపురంలో చేపట్టిన కార్యక్రమానికి కూడా ఆశించిన స్పందన రావడం లేదు. అటు మత్స్యకారుల్లో జనసేన పట్ల విశ్వాసం లేకపోవడం రెండోవైపు పవన్ కి మీడియాలో ప్రాధాన్యత తగ్గడం కారణంగా ఆ సభ విజయవంతం ఎలా అన్నది జనసేన శ్రేణులను సందిగ్ధంలో పడేస్తోంది. ఒకప్పుడు పవన్ వస్తున్నారని తెలిస్తే చాలు తరలివచ్చేసే శ్రేణుల్లో సైతం ఈసారి అలాంటి ఊపు కనిపించడంలేదని నాయకులే భావిస్తుండడం విశేషం. దాంతో మత్స్యకార సభ విజయవంతానికి జనసేన కార్యకర్తలు గతం కన్నా అదనంగా శ్రమించాల్సి వస్తోంది
Also Read : అప్పుడు వస్తుంటే ఆపారు..! ఇప్పుడు పిలిచినా రాలేదు..!!