iDreamPost
iDreamPost
అభిప్రాయ వ్యక్తీకరణకు,సమాచారాన్ని సెకన్లలో మిలియన్ల మందికి చేరవేయటానికి సోషల్ మీడియా బలమైన వేదిక. ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ నాయకులు,వ్యాపార,సినిమా,క్రీడా మరియు ఇతర రంగ ప్రముఖలు నిత్యం సోషల్ మీడియా వేదిక అభిప్రాయాలు పంచుకుంటుంటారు.
సోషల్ మీడియాలో ఒక్కో వెదికది ఒక్కో విశిష్టత. సెలెబ్రేటిస్ ఎక్కువగా ట్విట్టర్ వేదికగా స్పందిస్తుంటారు. ట్విట్టర్ ఫాలోయింగ్లో ప్రపంచవ్యాప్తంగా ప్రధాని మోడీ డి మూడవస్థానం.ఫేసుబుక్లో కూడా మోడీ ఫాలోయింగ్ చాలా ఎక్కువే.
మోడీ కూడా నిత్యం ట్విట్టర్లో ఎదో ఒక అంశం మీద స్పందిస్తుంటారు.
ఏమైందో ఏమో కానీ ఈ సాయంత్రం “అన్ని సోషల్ మీడియా వేదికల నుంచి తప్పుకోవటం గురించి ఆలోచిస్తున్నాను” అని మోడీ ట్విట్టర్లో అప్డేట్ పెట్టారు. ఇది ఊహించని సంగతి. గత రెండు-మూడు రోజులుగా రాజకీయంగా ఎలాంటి సంఘటనలు జరగలేదు. సోషల్ మీడియాలో యాంటీ మోడీ ప్రచారం కూడా ఏమి జరగలేదు.ఆ కోణంలో చూసినా మోడీ బాధపడే సంఘటనలు ఏమి లేవు .మరి ఎందుకు అకస్మాత్తుగా సోషల్ మీడియా నుంచి తప్పుకోవటం గురించి ఆలోచిస్తున్నానని మోడీ ట్వీట్ చేశారో ఎవరికీ అర్ధం కావటం లేదు.
జాతీయ మీడియాలో కూడా ఈ అంశం వీడి వార్తలు మాత్రం ప్రసారం అయ్యాయి కానీ ఎవరు కారణాలను విశ్లేషించలేదు..
మోడీ ట్వీట్ వెనుక కారణం కోసం రేపటి వరకు ఆగవాలసిందే.