Idream media
Idream media
తెలంగాణలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. ఇతర పార్టీలు కూడా ఉన్నప్పటికీ వాటి ఉనికి నామమాత్రమే. మాజీ ఐపీఎస్ అధికారి బీఎస్పీలో చేరి,చాపకింద నీరులా పార్టీ విస్తరణ పనిలో నిమగ్నమయ్యారు. షర్మిల కూడా వైఎస్ఆర్ టీపీ పేరుతో పార్టీ స్థాపించి ప్రస్తుతం పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. కాగా, ఇప్పుడు మరో కొత్త పార్టీ తెలంగాణలో పురుడుపోసుకుంటుందనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అక్కడ మరో కొత్త పార్టీ అవసరం ఉందంటూ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తాజా వ్యాఖ్యలు చేయడం ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. దీనికితోడు ఇటీవల పశ్చిమబెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఐదుగురు సభ్యుల బృందం తెలంగాణలో పర్యటించింది. టీఆర్ఎస్ పై అసంతృప్తులను, కొందరు ఉద్యమ నాయకులను కలిసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కొండా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఇతర రాష్ట్రాలకు చెందిన పార్టీల చూపు కూడా తెలంగాణపై పడుతోంది.
తెలంగాణలో మరో రాజకీయ పార్టీకి ఏర్పాట్లు జరుగుతున్నట్లు, ఇందుకు కొత్త వేదికలు సిద్ధమవుతున్నట్లు జోరుగా వార్తలు వస్తున్నాయి. పశ్చిమబెంగాల్‌కు చెందిన టీఎంసీ కాంగ్రెస్ అసంతృప్త నేతలకు, రాజకీయాలకు దూరంగా ఉన్న ప్రముఖులను చేరదీసి తమ పార్టీని తెలంగాణలో కూడా విస్తరించడానికి దీదీ ప్రయత్నాలు చేస్తున్న విషయం హాట్ టాపిక్ గా మారింది. 2021 ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లో గెలిచిన తర్వాత సీఎం బాధ్యతలు చేపట్టిన మమత స్పీడ్ పెంచారు. మణిపూర్, గోవా, మేఘాలయ, అస్సాం రాష్ట్రాల్లో ఇప్పటికే తృణమూల్ శాఖలను ప్రారంభించారు ముఖ్యమంత్రి మమత. కాంగ్రెస్ పార్టీలో అలకబూనిన నేతలే టార్గెట్‌గా దీదీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టినట్లు ప్రచారం సాగుతోంది.
Also Read : Amith Sha -Kashmir Tour -అమిత్ షా కాశ్మీర్ పర్యటనలో ఏమి జరిగింది?
తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు ప్రతినిధుల బృందం హైదరాబాద్‌లో ఇటీవల పర్యటించింది. మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డితో పాటు కొందరు నేతలతో టీఎంసీ నేతలు చర్చించినట్లు సమాచారం. మాస్ ఫాలోయింగ్‌తో పాటు ఆర్థిక వనరులు బలంగా ఉన్న నేతలను తమ పార్టీలోకి తీసుకువచ్చి.. బలమైన రాజకీయ శక్తిగా ఎదగాలని టీఎంసీ నేతల ఆలోచనగా చెబుతున్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లోకి వెళ్లలేక ఇబ్బంది పడుతున్న నేతలే టార్గెట్‌గా టీఎంసీ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. కొండా వంటి నేతలతో పాటు తెలంగాణలో ఉద్యమకారులు, ప్రజాసంఘాల నేతల టార్గెట్ గా తృణమూల్ కాంగ్రెస్ బృందం పనిచేస్తోంది. తృణమూల్ ఎంపీలు ఫ్రెండ్‌షిప్‌లో భాగంగా పలువురు మాజీ, తాజా ఎంపీలను కలవడం తెలంగాణ రాజకీయాల్లో కలవరం రేపుతోంది.
కాంగ్రెస్ కొత్త కార్యవర్గం వచ్చాక చాలా మంది సీనియర్ నాయకులు పార్టీ కార్యకలాపాలకు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. వాళ్ళని మెయిన్ టార్గెట్ పెట్టుకొని టీఎంసీ తన ప్రయత్నాలు వేగిరం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. హుజురాబాద్ ఎన్నిక తర్వాత దీదీ నేరుగా రంగంలోకి దిగి తన కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అటు, ఆమ్ ఆద్మీలాంటి పార్టీలు తెలంగాణలో విస్తరించేందుకు ప్రయత్నించినా,ఫలితం లేకుండా పోయింది. ఇటీవల కొండా మాట్లాడుతూ హుజూరాబాద్ లో పరోక్షంగా ఈటెల రాజేందర్ కు మద్దతు ఇస్తూనే, తెలంగాణలో మరో కొత్త పార్టీ అవసరం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బెంగాల్ సీఎం దీదీ, కొండా వంటి నేతల ద్వారా ఇక్కడ పార్టీని విస్తరించే పనిలో ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.
Also Read : Technical Committee – పెగాసస్ దుమారం : తేల్చేందుకు సిద్ధమైన సుప్రీం కోర్టు