Idream media
Idream media
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం కడియం మండలంలో జనసేన తరఫన గెలిచిన ఎంపీటీసీలు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను కలిశారు. మెజారిటీ సీట్లు జనసేన గెలవగా.. అధికార వైసీపీ ఎంపీపీ పదవిని చేజక్కించుకునేందుకు కుట్రలు చేస్తోందంటూ వారు జనసేనానికి ఫిర్యాదు చేశారు. వారి మాటలు విన్న పవన్ కల్యాణ్.. కడియం జనసేనదే.. అధికార పార్టీ కుట్రలు చేస్తే సహించను. ప్రభుత్వం పద్ధతి ప్రకారం ఎన్నికలు నిర్వహించాలని ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు.
ఈ ఘటనతో.. పవన్ కల్యాణ్ జనసేన పార్టీని నడపడంలో ఎలాంటి శ్రద్ధ కనబరుస్తున్నారు..? పార్టీ వ్యవహారాలు, ఎన్నికలను ఏ విధంగా పర్యవేక్షిస్తున్నారు..? అనేది తెలుస్తోంది. నేతలు చెప్పినది చెప్పినట్లు విని.. అదే మాట్లాడుతున్నారని కడియం విషయంలో పవన్ చేసిన వ్యాఖ్యలను బట్టీ స్పష్టంగా తెలుస్తోంది.
కడియం మండలంలో మొత్తం 22 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఇందులో వైసీపీ, జనసేనలకు ఒక్కొక్కటి చొప్పన ఏకగ్రీవమయ్యాయి. మిగతా 20 చోట్ల ఎన్నికలు జరిగాయి. ఇందులో వైసీపీ 8, జనసేన 8, టీడీపీ 4 చొప్పన గెలిచాయి. ఏకగ్రీవమైన జనసేన అభ్యర్థి చనిపోయారు. దీంతో ఆపార్టీ బలం 8గానే ఉంది. వైసీపీ బలం 9, టీడీపీ బలం 4 వద్ద ఆగింది.
ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులు గెలుచుకోవాలంటే 12 ఎంటీసీలు కావాలి. కానీ ఏ పార్టీ కూడా ఆ మార్కును చేరుకోలేదు.
Also Read : చంద్రబాబు వాకిట్లో పవనన్న పార్టీ, పశ్చిమలో ప్రస్ఫుటమైన తీరు
ఎన్నికలప్పుడే జనసేన, టీడీపీల మధ్య అనధికారికి పొత్తు ఏర్పడింది. జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ ఇక్కడ ఎక్కడా కనిపించలేదు. మొత్తం పోటీ జరిగిన 20 సీట్లలో జనసేన 11 చోట్ల, టీడీపీ 9 చోట్ల పోటీ చేశాయి. జనసేనకు ఎక్కువ సీట్లను ఆఫర్ చేసిన టీడీపీ ఎంపీపీ పదవిని మాత్రం తమకు ఇవ్వాలని షరతు పెట్టింది. ఆ షరతు ప్రకారం ఎవరు ఎక్కడ పోటీ చేయాలో నిర్ణయించుకుని బరిలోకి దిగారు, పరస్పర సహకారంతో బరిలోకి దిగడంతో 20 సీట్లకు గాను జనసేన, టీడీపీలు 12 చోట్ల గెలిచాయి. ఈ సంఖ్య మేజిక్ ఫిగర్.
అయితే మేజిక్ ఫిగర్ మాత్రమే రావడంతో.. ఎంపీపీ పదవి జారిపోతుందేమోనన్న అనుమానంతో టీడీపీ, జనసైనికులతో పవన్‌ను బోల్తా కొట్టించేందుకు యత్నించింది. కుదిరిన ఒప్పందం ప్రకారం నాలుగు సీట్లు గెలిచినా ఎంపీపీ పదవి టీడీపీదే. కడియం – 2 నుంచి గెలిచిన వెలుగుబంటి సత్యప్రసాద్ ఎంపీపీ పదవి దక్కుతుంది. కానీ జనసేన తరఫున గెలిచిన సభ్యులు జారిపోతారేమోనన్న సందేహం ఆయనలో నెలకొంది. చేతులు ఎత్తే విధానంలో ఈ నెల 24వ తేదీన ఎంపీపీ ఎన్నికల జరుగుతుంది. జనసేనకు గుర్తింపు లేకపోవడంతో ఆ పార్టీకి విజ్ జారీ చేసే అధికారం లేదని ఎన్నికల సంఘం మార్గదర్శకాల్లో పేర్కొంది.
ఇక్కడే రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన చాణక్యాన్ని ప్రదర్శించారు. జనసేన తరఫున ఎంపీటీసీలుగా గెలిచిన వారు.. అధికార పార్టీలో చేరకుండా ఉండేందుకు, అటు గెలిచిన వారిని, ఇటు అధికార పార్టీపై ఒత్తిడి తెచ్చేందుకు.. ఎంపీటీసీలు అందరూ పవన్ వద్దకు పంపారు. కడియం ఎంపీపీ మనదేనని వారితో పవన్‌కు చెప్పించారు. కానీ ఎక్కడా టీడీపీతో ఎంపీపీ పదవిపై జరిగిన ఒప్పందం గురించి చెప్పలేదు. ఎంపీపీ అభ్యర్థి ఎవరనేది తెలియనివ్వలేదు. వారు చెప్పినట్లుగానే పవన్ కడియం ఎంపీపీ జనసేనదే అంటూ ఓ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఈ తతంగాన్ని ముందు నుంచి గమనిస్తున్న జనసేన పార్టీ ముఖ్యనేత, రూరల్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చే సిన కందుల దుర్గేష్ ఈ వ్యవహారానికి దూరంగా ఉన్నారు.
Also Read : వయసైపోతోంది నాయకా..!