iDreamPost
android-app
ios-app

ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్(IJS) అవసరమా?

ఇండియన్ జ్యుడిషియల్ సర్వీస్(IJS) అవసరమా?

కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ IJS అవసరమని పాత్రికేయులతో అన్న తరువాత మరొకసారి చర్చ మొదలైంది.

1961 లో మొట్టమొదటి సారి హైకోర్టు ఉన్నత న్యాయ మూర్తుల సదస్సు లో IJS ప్రస్తావన-సూచన వచ్చింది.1976 లో అధికరణం-ఆర్టికల్ 312 ను సవరించడానిక ద్వారా రాజ్యాంగంలో IJS చేర్చబడింది.ఆర్టికల్ 312 ను అనుసరించి , 232 వ ఆర్టికల్ లో ప్రస్తావించిన జిల్లా న్యాయమూర్తులు అంత కంటే తక్కువ పదవులను IJS లో చేర్చారు.2012 లో మరొక సారి కేంద్రం లోని యుపిఎ ప్రభుత్వం ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చింది.

IJS ను ప్రతిపాదించినప్పటి నుంచి వ్యతిరేకిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు, హైకోక్టు న్యాయమూర్తులు ఉన్నారు.దీనికి ప్రధాన కారణం నియామకాలలో వారి ప్రాపకం ఉండకపోవడం. కానీ వారు చెబుతున్న కారణం దేశ వ్యాప్త సర్వీసుల వల్ల రాష్ట్రేతర వ్యక్తులు జడ్జిలుగా నియమించబడితే స్ధానిక సాక్షాలను (వాడుక లో ఉన్న ) స్ధానికతను అర్ధం చేసుకోలేరని వాదిస్తున్నారు.

మూడవ వంతు హైకోర్టు న్యాయమూర్తులు ప్రమోషన్ పద్దతిలో క్రింద జిల్లా జడ్జి స్ధాయి నుండి వస్తారు అందువల్ల స్ధానికులు హైకోరులలో న్యాయమూర్తుల అవకాశం కోల్పోతారని మరొక వాదన.

అయితే న్యాయవ్యవస్ధ లో పారదర్శకత , నిబద్దత పెరిగే అవకాశం ఉంది.దేశం లోని వివిధ న్యాయ కళాశాలలలో చదువుకున్న నిష్ణాతులు వెలికి తీయబడతారు.స్ధానిక భాష సివిల్ సర్వీసు వారి వలె నేర్చుకుంటే పెద్ద ఇబ్బంది ఉండదు.ప్రస్తుతం ఈ అకాడమీ ని హైదరాబాద్ తో పాటు మహారాష్ట్ర ప్రభుత్వం తమ దగ్గర పెట్టాలన పోటీ పడనతున్నాయి..