iDreamPost
android-app
ios-app

డ్రగ్స్ కేసు బండి సంజయ్ కు మైనస్ అయ్యిందా ?

డ్రగ్స్ కేసు బండి సంజయ్ కు మైనస్ అయ్యిందా ?

తెలంగాణలో డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు ఏ మలుపు తిరగబోతోంది ఏంటి అనే దానిపై క్లారిటీ లేదు. ముందు సినీ తారల వరకే పరిమితమైన ఈ డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు రాజకీయాలకు కూడా పాకడంతో ఏ పరిణామాలు జరగబోతున్నాయి ఏంటి అనే దానిపై మీడియా వర్గాలతో పాటు రాజకీయ సినీ వర్గాల్లో కొన్ని ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. బుధవారంతో సినీ నటుల విచారణ ముగిసింది. హీరో తరుణ్ ని ఈడి అధికారులు దాదాపుగా ఎనిమిది గంటలపాటు విచారించారు. అలాగే ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, గీతామాధురి భర్త నందు, హీరో రానా, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇలా 12 మందిని దాదాపుగా 20 రోజుల పాటు అధికారులు విచారించారు.

అయితే ఈ ట్రాక్స్ కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ జరుగుతున్న సమయంలోనే… పూరి జగన్నాథ్ అలాగే తరుణ్, రాణా సహ కొందరి రక్త నమూనాల్లో అలాగే వెంట్రుకులు నమూనాల్లో డ్రగ్స్ లేవని ఎఫ్ఎస్ఎల్ నివేదిక ఇచ్చింది. ఈ డ్రగ్స్ వ్యవహారంలో వాళ్లకు క్లీన్చిట్ అలా వచ్చిందో లేదో ఇది రాజకీయ మలుపు తిరిగింది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్ లక్ష్యంగా వైట్ ఛాలెంజ్ లో భాగంగా ఉస్మానియా ఆస్పత్రికి ఇద్దరం వెళ్ళి నమూనాలు ఇచ్చి వద్దాం అంటూ సవాల్ చేశారు.

Also Read : తెలంగాణకు గట్టి షాక్, పాలమూరు-రంగారెడ్డి ఆపాలని NGT ఆదేశం

దీనిపై మంత్రి కేటీఆర్ కూడా ట్విట్టర్లో ఘాటుగా స్పందిస్తూ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా తనతోపాటు టెస్ట్ కి ఎయిమ్స్ కి రావాలి అంటూ ట్వీట్ చేశారు. అలాగే ఓటుకు నోటు కేసు కు సంబంధించి రేవంత్ రెడ్డి లై డిటెక్టర్ టెస్ట్ కి రావాలి అని కేటీఆర్ అనడం ఆ తర్వాత సహారా తో పాటు బొగ్గు కుంభకోణంలో కేసీఆర్ కూడా లై డిటెక్టర్ టెస్ట్ కి సిద్ధం కావాలి అంటూ రేవంత్ రెడ్డి ట్విట్టర్లో పేర్కొన్నారు. అలా జరుగుతున్న తరుణంలోనే రేవంత్ రెడ్డి తన పరువుకు భంగం కలిగించారు అంటూ సిటీ సివిల్ కోర్టులో మంత్రి కేటీఆర్ పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై నిన్న కేటీఆర్ తరపు న్యాయవాదుల వాదనలను విన్న సిటీ సివిల్ కోర్టు రేవంత్ రెడ్డి ట్రాక్స్ కేసుకు సంబంధించి మంత్రి కేటీఆర్ పై ఎటువంటి ఆరోపణలు చేయవద్దని ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. అలాగే కోర్టులో వాదనలు సందర్భంగా కేటీఆర్ తరపు న్యాయవాదులు మంత్రి ఎమ్మెల్యే గాను అలాగే కీలక శాఖకు మంత్రిగా ఉన్నారని కాబట్టి రేవంత్ రెడ్డి ఆరోపణలు చేసినందుకు గాను కోటి రూపాయలు చెల్లించాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే దీనిపై రేవంత్ రెడ్డిని కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.

అయితే ఇటువంటి వ్యవహారానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు చేయలేకపోయారు. ఇక్కడ ప్రధాన అంశం ఏంటి అంటే దుబ్బాక ఉప ఎన్నికలు అలాగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల తర్వాత తెలంగాణలో భారతీయ జనతా పార్టీ వేగం పుంజుకుంది. దీంతో తెలంగాణలో టిఆర్ఎస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అనే భావనను కలిగించడానికి బండి సంజయ్ తీవ్రంగా ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి కంటే ముందు ఆయన పాదయాత్ర నిర్ణయం కూడా తీసుకుని వేగంగా ముందుకు వెళుతున్నారు.

Also Read : అభ్యర్థి మాట్లాడుతుంటే వెళ్లిపోతున్నారు..! హుజురాబాద్‌లో ఏం జరుగుతోంది..?

కానీ ఈ డ్రగ్స్ కేసులో అనూహ్యంగా రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలతో భారతీయ జనతా పార్టీ పూర్తిగా వెనకబడి పోయింది. వైట్ చాలెంజ్ విషయంలో బండి సంజయ్ తో పాటుగా పలువురు బీజేపీ నేతలు అలాగే ఎమ్మెల్యేలు కూడా ఘాటుగా స్పందించి ఉంటే… బాగుండేది. మంత్రి కేటీఆర్ లక్ష్యం గా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తర్వాత టిఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పడింది అనే అభిప్రాయం కూడా కొంతమందిలో వ్యక్తమైంది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో ఒక రకమైన ఉత్సాహం వచ్చింది అనే కామెంట్లు కూడా వినిపించాయి. అయితే ఈ పరిణామంలో భారతీయ జనతా పార్టీ వెనకబడి పోవడం బండి సంజయ్ దీన్ని సమర్థవంతంగా వాడుకోలేక పోవడం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టింది.

బండి సంజయ్ చేస్తున్న పాదయాత్ర కామారెడ్డి జిల్లాలో జరుగుతుంది. అయితే ఈ పాదయాత్రలో బండి సంజయ్ ఏ విమర్శలు చేస్తున్నా సరే మీడియా కూడా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. సోషల్ మీడియాలో కూడా రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ గాని పరిస్థితి నడుస్తోంది. వైట్ ఛాలెంజ్లో భాగంగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా స్పందిస్తూ తాను కూడా రెడీ అంటూ ప్రకటించారు. బండి సంజయ్ కూడా దీనిపై నామమాత్రంగా స్పందించారు… గాని ఇతర బీజేపీ నేతలు కూడా స్పందించి ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండేది.

పది రోజుల క్రితం బండి సంజయ్ మాట్లాడుతూ తెలంగాణలో అధికారంలోకి వస్తే కొందరికి రక్త పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటన చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో కొందరు గ్లామర్ కోసం డ్రగ్స్ వాడుతున్నారు అనే కామెంట్లు కూడా ఆయన నుంచి వినిపించాయి. కానీ డ్రగ్స్ పై పెద్ద ఎత్తున చర్చ జరిగే సమయంలో మాత్రం బండి సంజయ్ తేలిపోయారు. అటు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ఈ అంశంపై పెద్దగా స్పందించే ప్రయత్నం చేయలేదు.

Also Read : రేవంత్, కేటీఆర్ మధ్యలో సీపీఐ నారాయణ