iDreamPost
android-app
ios-app

IPL 2021 Fianl-కలకత్తా ఓడిపోతే ఆ పాపం కార్తిక్ దే…?

IPL 2021 Fianl-కలకత్తా ఓడిపోతే ఆ పాపం కార్తిక్ దే…?

బ్యాటింగ్ లేదు, కీపింగ్ లేదు… కెప్టెన్ గా పనికిరావు… ఎందుకు రా నువ్వు టీం లో… అన్నా వాడు మనిషి కాదన్నా… అదేం కీపింగ్ అన్నా… ఫైనల్ మ్యాచ్ అనుకున్నాడా గల్లీ మ్యాచ్ అనుకున్నాడా… ఆ జట్టుకి సగం దరిద్రం ఆడే…

దినేష్ కార్తిక్… డూప్లేసిస్ క్యాచ్ వదిలేసిన తర్వాత తిట్టిన తిట్లు ఇవి. మూడో ఓవర్ మొదటి బంతికి చక్కటి కీపింగ్ అవకాశం వస్తే… క్యాచ్ వదిలేసాడు కార్తిక్. ఆ తర్వాత డూప్లేసిస్ ఆడిన ఆట… కలకత్తా జట్టుకి చుక్కలు చూపించింది. ఆ తర్వాత చివరి బంతి మినహా ఏ ఒక్క అవకాశాన్ని కూడా అతను వదులుకోలేదు. ఆచి తూచి ఆడుతున్నట్టే కనపడినా ప్రతీ బంతీ జాగ్రత్తగా ఆడటం చెత్త బంతిని బౌండరీ కి తరలించడం… ప్రత్యర్ధిని బౌలర్ ఎవరు అయినా సరే బాదుడే మంత్రం గా ఆడాడు ఫాఫ్.

చెన్నై జట్టు ఈ మ్యాచ్ ని ఎలా అయినా సరే గెలవాలి అనే కసిగా బ్యాటింగ్ చేసింది. ప్లే ఆఫ్ లో అడుగు పెట్టిన తర్వాత చాలా వరకు ప్రత్యర్ధిని తక్కువ స్కోర్ కి కట్టడి చేసిన కలకత్తా బౌలర్లు ఈ మ్యాచ్ లో మాత్రం చెన్నై బ్యాటింగ్ కి లొంగిపోయారు. 20 ఓవర్లలో మూడు వికెట్ లు మాత్రమె కోల్పోయిన చెన్నై జట్టు 193 పరుగుల భారీ లక్ష్యాన్ని కలకత్తా ముందు ఉంచింది. గైక్వాడ్ తక్కువ పరుగులకే వెనుతిరిగినా ఆ తర్వాత వచ్చిన రాబిన్ ఊతప్ప తో కలిసి ఫాఫ్ చేసిన బ్యాటింగ్ బాగా ప్లస్ అయింది.

ప్లే ఆఫ్స్ కి ముందు చెత్త ఆట తీరుతో ఇబ్బంది పెట్టిన ఊతప్ప ఈ మ్యాచ్ లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. భారీ సిక్స్ లు కొడుతూ ప్రత్యర్ధిని ముప్ప తిప్పలు పెట్టాడు. ఇద్దరూ కలిసి చాలా వేగంగా అర్ధ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసారు. మూడు సిక్సులతో 31 పరుగులు చేసిన ఊతప్ప… నరైన్ బౌలింగ్ లో వికెట్ ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత వచ్చిన మోయీన్ అలీ అయితే ఊతప్ప లేని లోటు ని తీర్చాడు. ముందు ఆచి తూచి ఆడినట్టే కనపడిన అలీ… తర్వాత మూడు సిక్సులు రెండు ఫోర్లతో… 20 బంతుల్లో కేవలం 37 పరుగులు చేసాడు.

అయితే 15 ఓవర్ల తర్వాత కలకత్తా కాస్త బౌలింగ్ కట్టుదిట్టంగా వేసింది. శివం మావీ, వెంకటేష్ అయ్యర్ కాస్త జాగ్రత్తగా బంతులు విసిరారు. లేకుంటే ఆ ఊపులో చెన్నై భారీ స్కోర్ చేసే విధంగానే కనపడింది. మూడు సిక్సులు, ఏడు ఫోర్లతో 86 పరుగులు చేసిన డూప్లేసిస్ చివరి బంతికి శివం మావీ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. చివరి ఓవర్లో చాలా జాగ్రత్తగా బౌలింగ్ చేసాడు మావీ. లేకపోతే చెన్నై డబుల్ సెంచరీ చేసి ఉండేది.