iDreamPost
android-app
ios-app

ఉమా.. మైలవరంలో మైలేజీ కోసమేనా ఇదంతా?

ఉమా.. మైలవరంలో మైలేజీ కోసమేనా ఇదంతా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు ప్ర‌జ‌ల‌కు మ‌రింత చేరువ చేస్తున్నాయి. వాటిలో ఒక్క‌టైన పేద‌ల‌కు ఇళ్ల నిర్మాణం ప్రభుత్వానికి, వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు ఎన‌లేని కీర్తి తెచ్చింది. ఇదొక చారిత్ర‌క కార్య‌క్ర‌మంగా నిలిచిపోతుంద‌నే అభిప్రాయాలు స‌ర్వ‌త్రా వ్య‌క్తం అవుతున్నాయి. దేశంలోని ప‌లువురు ప్ర‌ముఖులు సైతం ఇళ్ల నిర్మాణాన్ని కొనియాడుతున్నారు. ప్ర‌భుత్వ ఈ త‌ర‌హా కీర్తి, ప్ర‌జ‌ల్లో వైసీపీ నేత‌ల‌కు పెరుగుతున్న ఖ్యాతి టీడీపీకి కంటివిడుపు క‌లిగిస్తోంది. ఆయా పార్టీ నేత‌ల‌ను ప్ర‌జ‌ల‌కు దూరం చేస్తోంది. పార్టీ ప‌రంగా కాక‌పోయినా వ్య‌క్తిగ‌తంగానైనా ప్ర‌జ‌ల్లో మైలేజీ పెంచుకోవాల‌ని టీడీపీ నేత‌లు త‌హ‌త‌హ‌లాడుతున్నాయి.

మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం జీ.కొండూరులో టీడీపీ నేత‌, మాజీ మంత్రి దేవినేని ఉమా సృష్ఠించిన వివాదం మైలేజీ పెంచుకోవ‌డం కోస‌మేనా..? అంటే అవున‌నే స‌మాధానాలు చాలా వినిపిస్తున్నాయి. అస‌త్య ప్ర‌చారాలు, త‌ప్పుడు ఆరోప‌ణ‌లు చేయ‌డం ద్వారా అక్క‌డ ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం సృష్టించే ప్ర‌య‌త్నాలు చేసిన‌ట్లుగా తెలుస్తోంది. అర్ధ‌రాత్రి వేళ ఆ స్థాయిలో టీడీపీ కార్యకర్తలు అక్క‌డ‌కు చేరుకోవ‌డం వెనుక ముంద‌స్తు ప్ర‌ణాళిక‌లు ఉన్న‌ట్లు స్ప‌ష్టం అవుతోంది. కొండూరు వివాదానికి దేవినేని ఉమ‌ ప్రదాన కారణమని ఏలూరు రేంజ్ డీఐజీ మోహన రావు, కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ వ్యాఖ్య‌లు కూడా ఇదే విష‌యాన్ని తెలుపుతున్నాయి.

ఉమా వ్య‌వ‌హార శైలిపై స్థానికంగా కూడా భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి. ప్రశాంతంగా ఉండే మైల‌వ‌రం రాజ‌కీయాల కార‌ణంగా ఇప్పుడు మండుతుండ‌డ‌మే ఇందుకు కార‌ణం. అక్రమాలు జరుగుతున్నాయన్న వాదనలు లేవని.. లేని దాన్ని ఉన్నట్లుగా వక్రీకరిస్తున్నారని వైసీపీ వర్గాలు వాదిస్తున్నాయి. పోలీసు స్టేషన్ వద్ద వైసీపీ నేత కారును ధ్వంసం చేసిన వైనాన్ని చూపించని మీడియా ఏకపక్షంగా వ్యవహరిస్తోందని వైసీపీ ఎమ్మెల్యే మండిపడుతున్నారు. దేవినేని ఉమ కారణంగా చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితులపై మైలవరం ఎమ్మెల్యే క్రిష్ణ ప్రసాద్ ఘాటుగా రియాక్టు అయ్యారు.

మంత్రి దేవినేని ఉమ కొంతకాలంగా స్థానిక ఎమ్మెల్యే పైనా, ప్రభుత్వంపైన విష ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. అధికారంలో ఉన్న‌ప్పుడు ఒక‌లా.. అధికారం పోయాక మరోలా మాట్లాడుతున్నారు. సంబంధం లేని అంశాలతో చెత్తాచెదారాన్ని అంతా తీసుకొచ్చి గాలి పోగేస్తున్నారు. రక్షిత అటవీ ప్రాంతమైన కొండపల్లి కొండల్లోకి ఇప్పటికి 15 సార్లు వెళ్ళి.. ఒక అబద్ధాన్ని నిజం చేయాలని తెగ ప్ర‌య‌త్నాలు చేశారు. కొండపల్లి ప్రాంతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అనుమతులు ఇప్పించిందీ దేవినేని ఉమానే. అప్పుడు అవి రెవెన్యూ భూములు అని చెప్పి ప్రారంభోత్సవాలు చేశారు. దేవినేని ఉమ దురుద్దేశపూర్వకంగా.. ముందస్తు ప్లాన్‌లో భాగంగానే జి.కొండూరు వెళ్లినట్లు పోలీసులు కూడా పేర్కొంటున్నారు. ఇదంతా గ‌మ‌నిస్తే మైలేజీ పెంచుకోస‌మే ఉమ ఇదంతా చేస్తున్నార‌నే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.