iDreamPost
iDreamPost
భారత్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు కరోనా వైరస్ సోకినట్టు తెలుస్తుంది. ఈ మేరకు పాకిస్తాన్ మీడియా కొన్ని కథనాలు ప్రసారం చేసింది. పాక్ మీడియా కథనం ప్రకారం దావుద్ ఇబ్రహీం మరియు అతని భార్యకు కరోనా వైరస్ పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో వారిద్దరు పాకిస్తాన్ మిలటరీ హాస్పిటల్ లో చేరి చికిత్స్ పొందుతున్నట్టు తెలుస్తుంది.
ఇక దావూద్ ఇబ్రహీం స్టాఫ్ మొత్తం సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్ళినట్టు తెలుస్తుంది. 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న 64 ఏళ్ల దావూద్ ఇప్పటికే పలు దీర్ఘకాలిక రోగాల బారిన పడి డాక్టర్ల పర్యవేక్షనలో ఉంటు తరచూ కరాచీలోని ఒక హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నట్టు పలు వార్తలు వెలువడ్డాయి. ఇప్పుడు వీటికి కరోనా తోడవ్వడంతొ దావూద్ ఆరోగ్యం ఆందోళనకరంగానే ఉన్నట్టు తెలుస్తుంది.