iDreamPost
iDreamPost
వైఎస్సార్సీపీ నేతలకు, ముఖ్యంగా కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ముడిపెట్టే ప్రయత్నంలో వ్యవహారం బాబు మెడకు చుట్టుకుంటుంది. ఏపీలో అధికార పార్టీ మీద చేస్తున్న అనేక ప్రచారాల పరంపరలో తాజాగా డ్రగ్స్ మాఫియా చేరింది. దానికి డాన్ ఏపీలోనే ఉన్నారంటూ వ్యవహారం కాకినాడ పోర్టు వైపు టీడీపీ నేతలు మళ్లించారు. చివరకు కాకినాడ ఎమ్మెల్యే ఐవరీకోస్ట్ అనే దేశంలో చేసిన పర్యటనకు కూడా డ్రగ్స్ కారణమని ఆరోపించేశారు. దానికి మూలం కాకినాడ పోర్టు ఆధారంగా వివిధ వ్యవహారాలు చక్కదిద్దే అలీషాను ఆధారంగా చూపించారు.
గతంలో అలీషా కంపెనీలో పనిచేసిన సుధాకర్ కి కాకినాడకు ముడిపెట్టేశారు. తాజాగా ముంద్రా పోర్టులో పట్టుబడిన డ్రగ్స్ ట్రాన్స్ పోర్టు లైసెన్సు యజమాని సుధాకర్ కాకినాడలో పనిచేసినందును కాకినాడ ఎమ్మెల్యేనే బాధ్యుడనే ఆరోపణలు చేశారు. నిజమే అనుకుందామా అంటే సుధాకర్ కాకినాడలో పనిచేసింది 2007-08 మధ్య కావడంతో అప్పటికి కాకినాడ ఎమ్మెల్యే కూడా కాని చంద్రశేఖర్ రెడ్డికి ఏం సంబంధం అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అయినా గానీ సుధాకర్ తో సంబంధం అంటగట్టేసి ఆనందిచాలనుకున్న టీడీపీ నేతలకు షాక్ ఇచ్చే విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read : హెరాయిన్ కథలో విజయవాడ తర్వాత ఇప్పుడు కృష్ణపట్నం
కాకినాడలో డ్రగ్స్ దిగుమతులు చేస్తున్నారని టీడీపీ నేతలే ఆరోపించినా అలీషా కి చంద్రబాబు తో సన్నిహిత సంబంధాలున్నాయి. బాబుతో అలీషా క్లోజ్ గా ఉన్న ఫోటోలు కూడా వెలుగులోకి వచ్చాయి. దాంతో ఈ భాగోతం ఇప్పుడు టీడీపీ నేతలకు చుట్టుకునేలా కనిపిస్తోంది. నిజంగా టీడీపీ ఆరోపిస్తున్నట్టు డ్రగ్స్ దందాని అలీషా నడుపుతున్నట్టయితే ఆ మాఫియాలో ఉన్న అలీషాతో చంద్రబాబు ఎలా స్నేహం చేశారు. ఒకవేళ అలీషాకి సంబంధం లేదని టీడీపీ నేతలు చెప్పదలచుకుంటే మరి చంద్రశేఖర్ రెడ్డికి, వైఎస్సార్సీపీకి ముడిపెట్టే ప్రయత్నాలేలా.
అలా కాదు గతంలో చంద్రబాబు తో ఉన్నప్పుడు చక్కనోడు, ఇప్పుడే డ్రగ్స్ కి అలవాటుపడ్డాడని అనుకుందామంటే సుధాకర్ కాకినాడలో పనిచేసింది అంతకుముందే కదా అంటే సుధాకర్ కాకినాడ పోర్టులో పనిచేసిన సమయానికి అలీషా డ్రగ్స్ వ్యాపారంలో లేడని టీడీపీ వాదనే చెబుతుంది కదా. అంటే టీడీపీ వాదన ప్రకారమే చూసినా డ్రగ్స్ దందాలో ఉంటే గింటే టీడీపీ నేతల పాత్రే ఉండాలి తప్ప వైఎస్సార్సీపీకి అంత సాన్నిహిత్యం కనిపించం లేదు. ఇక కాకినాడ పోర్టు ఆధారంగా గతంలో ఆయిల్ మాఫియా సహా అనేక అక్రమాలకు పాల్పడింది కూడా టీడీపీ నేతలే కాబట్టి ఆపార్టీ పెద్దల పాత్రే ఉండాలి తప్ప ఇప్పుడు అధికార పార్టీ నేతలకు అవకాశం కనిపించడం లేదు. కాబట్టి డ్రగ్స్ చుట్టూ చేసిన మాయాజాలం కూడా బాబు మెడకు చుట్టుకుంటున్న వైనం పెద్ద ఆశ్చర్యం అనిపించడం లేదు.
Also Read : డ్రగ్స్ వ్యవహారంలో టీడీపీ ఆరాటం ఎందుకో, ఆపార్టీ నేతల దృష్టి అటు మళ్లిందెందుకో?