iDreamPost
android-app
ios-app

Tdp,vangaveeti radha-వంగవీటి రాధా కొత్త నియోజకవర్గం నుంచి పోటీ?

Tdp,vangaveeti radha-వంగవీటి రాధా కొత్త నియోజకవర్గం నుంచి పోటీ?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొంతమంది రాజకీయ భవిష్యత్తు గురించి నమ్ముకున్న వారు కూడా కాస్త ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంటారు. రాజకీయంగా మంచి పలుకుబడి ఉన్నా సరే సరైన ఆలోచన ధోరణి లేక సరైన వ్యూహాలు లేక ఇబ్బంది పడే పరిస్థితి కొందరికి ఎక్కువగా ఉంటుంది. అందులో ప్రధానంగా దిగవంత వంగవీటి మోహన రంగా కుమారుడు వంగవీటి రాధా రాజకీయ భవిష్యత్తుపై చాలామందికి చాలా అనుమానాలున్నాయి. 2004లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి 2014లో వైసిపి నుంచి పోటీ చేసి 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి ఇప్పుడు జనసేన వైపు చూస్తున్నారు వంగవీటి రాధా.

2019 ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీరు నచ్చక ఆయన పార్టీ మారి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే కచ్చితంగా ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చంద్రబాబు నాయుడు అప్పట్లో ఆయనకు ఆఫర్ ఇచ్చారు. అదేవిధంగా మంత్రి పదవి కూడా ఇస్తామని చెప్పినట్లు గా ప్రచారం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత వంగవీటి రాధా కొన్ని కారణాల వల్ల సైలెంట్ అయ్యారు.

Also Read : Mini Municipal Elections – టీడీపీ పొత్తుల రాజకీయం.. అదే లక్ష్యమా..?

 వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో కాస్త ఇబ్బంది పడుతున్నారనే ప్రచారం గత నెలరోజుల నుంచి ఎక్కువగా జరుగుతోంది. ఇటీవల గుడివాడ లో కొడాలి నాని తో ఆయన సమావేశం కావడం అదేవిధంగా అక్కడ కొన్ని పర్యటనలు చేయడం కొంత మంది నాయకులతో సమావేశాలు నిర్వహించడం వంటివి చేశారు. దీనిపై పరోక్షంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వార్నింగ్ ఇస్తూ ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఆ తర్వాత వంగవీటి రాధా సైలెంట్ అయిపోయారు.

ఇప్పుడు వంగవీటి రాధాకు తెలుగుదేశం పార్టీ ఒక నియోజకవర్గ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. గుంటూరు పశ్చిమ నియోజక వర్గానికి సంబంధించి ప్రస్తుతం కోవెలమూడి నాని ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే ఆ నియోజకవర్గానికి సంబంధించి వంగవీటి రాధకు బాధ్యతలు అప్పగించాలని నానీ కి మరో బాధ్యతలను అప్పగించాలని తెలుగుదేశం పార్టీ అధిష్టానం భావిస్తోందని అంటున్నారు. ఆ నియోజకవర్గంలో కాపు సామాజికవర్గ ఓటు బ్యాంకు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడ వంగవీటి రాధను ముందుకు తీసుకురావాలని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

Also Read : Kamineni Srinivas – మాజీ మంత్రి గారు పాలిటిక్స్ కంటే సినిమాలే బెటరనుకుంటున్నారా?

అయితే జనసేన పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఆయనకు ఆఫర్ చేసిందని కూడా ప్రచారం ఉంది. ఇటీవల ఆయనతో మాట్లాడిన జనసేన పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు ఇస్తామని, ఇప్పుడు అక్కడి నుంచి పని చేసుకునే విధంగా చూడాలని సెంట్రల్ నియోజకవర్గానికి పోతిన వెంకట మహేష్ బాధ్యతలు వహిస్తున్నారని చెప్పినట్లుగా సమాచారం. అయితే ఆయన జనసేన పార్టీలో కి వెళ్తారా లేదా అనే దానిపై క్లారిటీ లేకపోయినా తెలుగుదేశం పార్టీ అధిష్టానం మాత్రం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సీటును ఆయనకు కేటాయించే విధంగా ప్రయత్నాలు చేస్తోందని అంటున్నారు.