iDreamPost
android-app
ios-app

Ganja control act – గంజాయి విషయంలో జగన్ కొత్త చట్టం…? దొరికితే అంతే…?

Ganja control  act – గంజాయి విషయంలో జగన్ కొత్త చట్టం…? దొరికితే అంతే…?

ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్యకాలంలో గంజాయి వ్యవహారాన్ని తెలుగుదేశం పార్టీ తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునే ప్రయత్నం చేయడం కాస్త విడ్డూరంగా మారిన అంశం. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా సరే కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలను, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేయడం అలాగే వైసిపి నాయకులకు ఆపాదించే ప్రయత్నం చేయడం వంటి చర్యలు చాలామందిని షాక్ కు గురిచేశాయి. కొంతమంది తెలంగాణ పోలీసులు చేస్తున్న వ్యాఖ్యలను కూడా తెలుగుదేశం పార్టీ తన రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం ఆశ్చర్యపరిచింది.

అయితే… కొన్ని దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాల నుంచి గంజాయి వివిధ ప్రాంతాలకు రవాణా అవుతూనే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వరంగల్ సహా కొన్ని ప్రాంతాల్లో గంజాయి రవాణా ఎక్కువగా ఉండేది. ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున బయటి ప్రాంతాలకు సరఫరా ఉండేది. ప్రధానంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం అయిన విశాఖ మన్యం నుంచి పెద్ద ఎత్తున గంజాయి దేశంలోని పలు ప్రాంతాలకు రవాణా అవుతోంది అనే అంశాన్ని పోలీసులు కూడా గుర్తించి చర్యలు చేపట్టారు.

తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో కూడా పెద్ద ఎత్తున గంజాయి వివిధ ప్రాంతాలకు రవాణా అయింది. అయితే గంజాయి ఇప్పుడు మాత్రమే రవాణా అవుతోంది అన్నట్టుగా చంద్రబాబు సహా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియా ముందుకు వచ్చి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. దానికి తోడు కొంతమంది తెలంగాణ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడం, తెలుగుదేశం పార్టీకి బాగా కలిసి వచ్చిన అంశం. అయితే ఆంధ్రప్రదేశ్ పోలీసులు మాత్రం గంజాయి మూలాల మీద ఎక్కువగా దృష్టి సారించి దాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

Also Read : Prakasham, Tdp – ప్రకాశం జిల్లా టీడీపీలో ఇష్టం లేని కష్టం…?

ఈ నేపథ్యంలోనే విశాఖ అలాగే శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలోని మన్యం ప్రాంతాలకు సంబంధించి ఆయా జిల్లాలలో ఎస్పీలు ఎక్కువగా ఫోకస్ పెట్టారు. కొన్ని ప్రాంతాల నుంచి గంజాయి రవాణా అవుతుంది అనే అంశాలను గుర్తించి చెక్ పోస్టులను కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. అయితే గంజాయి రవాణా ఆగకపోవడంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దీనికి సంబంధించి కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందనే వార్తలు వినపడుతున్నాయి. దిశ చట్టం తరహాలో ఒక కొత్త చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

ఇప్పటివరకు గంజాయి దొరికిన వారి మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడం, ఆ తర్వాత కొన్ని రోజులకు వాళ్లు బయటకు రావడం వంటివి సర్వసాధారణంగా జరిగిపోతూ వచ్చాయి. కానీ ఇప్పటి నుంచి మాత్రం ఆ విధంగా జరగకుండా దిశ చట్టం తరహాలో కేవలం నెల రోజుల్లో విచారణ పూర్తి చేసి వాళ్ళకి శిక్ష పడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించి రాజ్యాంగ నిపుణులతో ఇప్పటికే ఏపీ ప్రభుత్వం చర్చలు జరుపుతోందని, త్వరలోనే ఈ కఠిన చట్టాన్ని ప్రవేశ పెట్టే విధంగా ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయని ఏపీ ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

కనీసం 7 నుంచి 10 ఏళ్లపాటు దీనికి సంబంధించి శిక్ష పడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది అని అంటున్నారు. గంజాయి రవాణా చేసే వ్యక్తులకు సంబంధించి గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా…? వాళ్ళ పై ఉన్న క్రిమినల్ కేసులు ఏ స్థాయిలో ఉన్నాయి…? అలాగే వాళ్ళు ఎవరికి సరఫరా చేస్తున్నారు…? వాళ్లకు సహకరించేది ఎవరు…? అదేవిధంగా వాళ్లకు ఆర్థిక వనరులు సమకూర్చేది ఎవరు…? అనే అంశాలకు సంబంధించి విచారణ వెంటనే పూర్తి చేసి వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం శిక్ష పడే విధంగా వ్యవహరించే అవకాశం ఉండవచ్చని, అలాగే గంజాయి కేసులో దొరికిన వారు డ్రైవింగ్ లైసెన్స్ శాశ్వతంగా రద్దు చేసే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని సమాచారం.

Also Read : AP Welfare Schemes – సంక్షేమ పథకాల అమలు.. ఇదేలా సాధ్యం..?