Idream media
Idream media
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి ఓఎస్‌డీగా తెలంగాణ జైళ్ల శాఖ సూపరింటెండెంట్ డాక్టర్ డి. దశరథరామిరెడ్డి నియమితులయ్యారు. ఆయన్ను డిప్యూటేషన్‌పై ఆంధ్రప్రదేశ్‌కు పంపేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించడంతో.. ఈ మేరకు దశరథరామిరెడ్డిని ఓఎస్‌డీగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో దశరథరామిరెడ్డి రెండేళ్లపాటు పని చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పని చేసేందుకు తన ఆసక్తిని డి.దశరథరామిరెడ్డి ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేసి.. దశరథరామిరెడ్డిని డిప్యూటేషన్‌పై పంపాలని కోరింది. ఏపీ వినతి పరిగణలోకి తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం దశరథరామిరెడ్డి ఆసక్తి మేరకు ఆయన్ను రెండేళ్లపాటు డిప్యూటేషన్‌పై పంపేందుకు అనుగుణంగా ఈ నెల 3వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read : వివేక్ వెంకటస్వామి పార్టీ మారడం లేదట..! అదంతా ఫేక్ ప్రచారమట..!