iDreamPost
android-app
ios-app

BCCIకి కాసుల వర్షం.. 44 వేల కోట్లకు అమ్ముడైన IPL ప్రసార హక్కులు..

  • Published Jun 13, 2022 | 8:45 PM Updated Updated Jun 13, 2022 | 8:45 PM
BCCIకి కాసుల వర్షం.. 44 వేల కోట్లకు అమ్ముడైన IPL ప్రసార హక్కులు..

BCCIకి కాసుల వర్షం కురిసింది. ఇటీవల జరిగిన IPL తో ప్రసార హక్కులు చేసిన సంస్థల కాలం తీరిపోయింది. దీంతో వచ్చే నాలుగు సంవత్సరాలకు గాను IPL ప్రసార హక్కులకు బిడ్డింగ్ జరిగింది. 2023-2027 కాలానికి గాను ఈ బిడ్డింగ్ జరిగింది. BCCI ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా IPL ప్రసార హక్కుల బిడ్డింగ్ జరిగింది.

ఈ వేలంపాటలో టీవీ ప్రసార హక్కులను 23,575 కోట్లకు సోనీ టీవీ దక్కించుకోగా, డిజిటల్‌ ప్రసార హక్కులను 20,500 కోట్లకు జియోకి చెందిన సంస్థ వయాకామ్ 18 సొంతం చేసుకుంది. దీంతో మొత్తం 44,075 కోట్లకు ప్రసార హక్కులు అమ్ముడుపోయాయి. ఇంత భారీ ధరకు అమ్ముడుపోవడం ఇదే మొదటిసారి. దీంతో ఎందరో ఆశ్చర్యపోయారు. మొత్తం 410 మ్యాచ్ లకు గాను ఈ రేట్లకు అమ్ముడుపోయాయి.

బేసిక్ బిడ్డింగ్ ప్రైజ్ టీవీ ప్రసార హక్కుల కోసం ఒక్కో మ్యాచ్ కు రూ. 49 కోట్లు, డిజిటల్ హక్కులు రూ. 33 కోట్లు పెట్టగా ఈ బిడ్డింగ్‌లో టీవీ ప్రసార హక్కులు ఒక్కో మ్యాచ్‌కు రూ.57.5 కోట్లు, డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ గరిష్టంగా రూ.50 కోట్లకు అమ్ముడుపోయాయి. ఇక ముంబై వేదికగా జరిగిన ఈ బిడ్డింగ్‌లో డిస్నీ స్టార్, సోనీ నెట్‌వర్క్‌, వయాకామ్ 18, జీ, ఫన్ ఆసియా, సూపర్ స్పోర్ట్, టైమ్స్ ఇంటర్నెట్, హాట్ స్టార్ వంటి పలు దిగ్గజ కార్ప్‌రేట్‌ కంపెనీలు పోటీ పడ్డాయి.