కెప్టెన్ మారిన కథ మారలేదు. అదే బౌలింగ్ బ్యాటింగ్ తీరుతో సన్రైజర్స్ హైదరాబాద్ ఆరో ఓటమితో నాకౌట్ ఆశలను వదులుకుంది. ఆదివారం రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ బలమైన బౌలింగ్ను రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మెన్ చక్కగా వినియోగించుకున్నారు. రాజస్థాన్ ఓపెనర్ బట్లర్ అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్ సంజు శాంసన్ అతనికి చక్కని సహకారం అందించడంతో ఆకాశమే హద్దుగా బట్లర్ బౌండరీల మోత మోగించాడు. ఫలితంగా మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 220 రన్స్ భారీ స్కోరును నమోదు చేసింది.
నిన్న మొన్నటి వరకు స్వల్ప స్కోర్లు , చేదన లో నెమ్మది, ఆట ఎంతో చిరాకుగా ఆడిన ఐపీఎల్ ప్లేయర్లు చివరికి వచ్చేసరికి అద్భుతంగా ఆడుతున్నారు. పిచ్ లు సైతం బ్యాటింగ్కు బాగా అనుకూలించడంతో బ్యాట్స్మెన్లు ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్నారు. ఐపీఎల్ చివరికి వచ్చే సమయానికి భారీ స్కోర్లు నమోదు అవుతున్నాయి. ఆదివారం జరిగిన రెండు మ్యాచ్లలో మొదటి మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ బ్యాట్స్మెన్లను కట్టడి చేయడంలో ఘోరంగా విఫలమైంది. పవర్ ప్లే లో రాజస్థాన్ బ్యాట్స్మెన్లను కట్టడి చేసి తక్కువ స్కోరు ఇచ్చిన హైదరాబాద్ బౌలర్లు తర్వాత పూర్తిగా బౌలింగ్ను విస్మరించారు. దీంతో మొదటి వికెట్ త్వరగా పడినా, తర్వాత వికెట్ తీయడానికి హైదరాబాద్ బౌలర్లు ముప్పుతిప్పలు పడ్డారు. ముఖ్యంగా ఓపెనర్ బట్లర్ అర్థ సెంచరీ వరకు చాలా సాధారణంగానే ఆడిన, తర్వాత వీరవిహారం తో రెచ్చిపోయాడు. 8 సిక్సర్లు 11 ఫోర్లతో 64 బాల్స్ లోనే 124 స్కోర్ ను చేశాడు. బౌండరీల మాత మోగిస్తున్న బట్టలకు కెప్టెన్ సంజు శాంసన్ తగిన సహకారం అందించి 33 బాక్సులు 48 స్కోర్ చేశాడు. కీలకమైన సమయంలో సంజు అవుట్ అయినప్పటికీ బట్లర్ లో వేగం తగ్గలేదు. ఇంకా రెండు ఓవర్లు ఉన్న సమయంలో బట్లర్ బౌల్డ్ గా వెనుదిరాగాడు. ఐపీఎల్ సీజన్ లో అత్యధిక స్కోరు నమోదు చేశాడు. బట్లర్ దెబ్బకు రాజస్థాన్ రాయల్స్ స్కోర్ ఏకంగా 220 రన్స్ కు చేరుకుంది.
అత్యంత భారీ స్కోరును చేధించేందుకు రంగంలోకి దిగిన హైదరాబాద్ సన్రైజర్స్ బ్యాట్స్మన్లు ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయారు. ఓపెనర్ గా వచ్చిన మనీష్ పాండే, బైర్స్టో లు 30, 31 కోరు చేసి వెంటనే అవుట్ అనగా కెప్టెన్ కెన్ విలియమ్స్ ఎక్కువ బాల్స్ తీసుకొని తక్కువ స్కోర్ చేసి అవుట్ కావడం హైదరాబాద్ అభిమానులను నిరాశకు గురిచేసింది. తర్వాత వచ్చిన ఏ బ్యాట్స్మెన్ కూడా రెండంకెల స్కోరును నమోదు చేయడానికి ఆపసోపాలు పడ్డారు. నబీ, సమద్ కాసేపు అలరించిన సరైన బ్యాట్స్మెన్లు ఎవరూ లేకపోవడంతో రాజస్థాన్ విజయం ఖాయమైంది. మొత్తం 20 ఓవర్లు ఆడిన హైదరాబాద్ బ్యాట్స్మెన్లు 165 రన్స్ మాత్రమే చేయడంతో ఘోర ఓటమి తప్పలేదు.
ఆదివారం రెండో మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ తో పంజాబ్ కింగ్స్ తలపడనుంది. టాస్ గెలిచి పంజాబ్ ఢిల్లీ బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్లో గెలిచి తన పరువు నిలుపుకోవాలని పంజాబ్ పడుతుంటే, పాయింట్స్ టేబుల్ లో మెరుగైన స్థానం సాధించాలని ఢిల్లీ తాపత్రయపడుతోంది.