iDreamPost
android-app
ios-app

పాలేరు ఆధిపత్య పంచాయితీ ఇప్పట్లో తీరేలాలేదు

పాలేరు ఆధిపత్య పంచాయితీ ఇప్పట్లో తీరేలాలేదు

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరని అంటారు. పదవి చుట్టే రాజకీయాలు నడుస్తాయి. అధికార పార్టీలో ఉన్న పదవిలో ఉండాలన్నదే పొలిటికల్ లీడర్ల టార్గెట్. సేమ్ సీన్ ఖమ్మం పాలేరు నియోజకవర్గంలో జరుగుతుంది. అధికార పార్టీలో ఉన్న ఇద్దరు నాయకుల మధ్య ఆధిపత్య పోరు రోజురోజుకు పెరుగుతూ చివరికి పోలీసు స్టేషన్లో కేసులు పెట్టుకునే వరకు వెళ్ళింది. పాలేరు నియోజకవర్గంలో అధికార టిఆర్ఎస్ పార్టీ నేతలు తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మధ్య ఇప్పుడు పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంది. నియోజకవర్గంలో పై చేయి సాధించడం కోసం ఇరువర్గాల నేతల అనుచరులు సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోసుకుంటున్నారు.

అసలు పంచాయితీ ఏంటి..

40ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం, ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా పని చేసిన తుమ్మలకు స్థానిక ఎమ్మెల్యే కందాలకు మధ్య పోరు 2018ఎన్నికల నుండి స్టార్ట్ అయింది.మూడుసార్లు సత్తుపల్లి నుండి ఒకసారి ఖమ్మం నుండి పోటీ చేసి గెలిచిన తుమ్మల 2016లో రాం రెడ్డి వెంకట్ రెడ్డి అకాల మరణంతో వచ్చిన పాలేరు ఉప ఎన్నికలో అధికార టిఆర్ఎస్ తరుపున పోటీ చేసాడు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్ళీ టిఆర్ఎస్ తరుపున పోటీ చేసి ఓడిపోయారు తుమ్మల. అయితే మొదటి నుండి కాంగ్రెస్ లో కొనసాగిన కందాల ఉపేందర్ రెడ్డి కాంట్రాక్టర్ గా మంచి పేరు ఉన్న రాం రెడ్డి వెంకట్ రెడ్డి జమానా అయిపోయేవరకు అవకాశం రాలేదు. 2018 ఎన్నికల్లో పాలేరు నుండి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీచేసి టిఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల మీద గెలిచారు. తరువాత టిఆర్ఎస్ లో చేరాడు.

ఇక్కడే అసలు సమస్య మొదలయింది. కందాల టిఆర్ఎస్ కు రావడం తుమ్మల వర్గానికి జీర్ణం కాలేదు. అప్పుడు మొదలయిన పంచాయితీ రేవంత్ రెడ్డి పీసీసీ బాధ్యతలు చేపట్టిన తరువాత కందాల కాంగ్రెస్ కోవర్ట్ గా వ్యవహరిస్తున్నాడని తుమ్మల వర్గీయులు ఆరోపిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బలం నిలుపుకోవడానికి ఎమ్మెల్యే కందాల తమ మీద అనవసర కేసులు పెట్టి ఇబ్బందులు చేస్తున్నాడని తుమ్మల వర్గీయులు ఎస్పీ విష్ణు వారియర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే కందాల తనకు అనుకులంగా వ్యవహరించే పోలీసులకు పోస్టింగ్ ఇప్పించుకుంటూ మాజీ మంత్రి తుమ్మల వర్గీయుల మీద sc,st అట్రాసిటీ కేసులు పెడుతూన్నారని ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధినాయకత్వం మాత్రం నోరుమెదపడం లేదుము పాలేరులో ప్రతిపక్షమే లేదు ఇంకా వర్గ పోరు ఏంటి అని లైట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

తుమ్మల పరిస్థితి ఏంటి..

నాలుగు దశాబ్దాలు రాజకీయ అనుభవం ఉన్న తుమ్మల జిల్లాలో బలమైన నాయకుడిగా ఎదిగారు. ఏపార్టీలో ఉన్న ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయం చేసి మిగిత సమయంలో జిల్లా, నియోజకవర్గ అభివృద్ధి మీద ఫోకస్ చేస్తారని జిల్లాలో టాక్. తెలంగాణ అనంతపూర్ గా భావించే తిరుమలయపాలెం మండలాన్ని భక్త రామదాసు ప్రాజెక్టు ద్వారా సస్యశ్యామలం చేశారు తుమ్మల. ఇంత రాజకీయ అనుభవము అభివృద్ధి చేసిన తుమ్మల 2018 ఎన్నికల్లో ఓటమి పలు కావడం జిల్లాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఎన్నికల్లో ఓటమి తరువాత సైలెంట్ అయినా తుమ్మల మళ్ళీ ఇటీవల పాలేరులో యాక్టీవ్ అయ్యారు. నియోజకవర్గంలో వరుస కార్యక్రమలలో పాల్గొంటూ పాలేరు తనదేనని కార్యకర్తలకు తాను ఉన్నానని మనోబలం కల్పిస్తున్నారు.

తుమ్మల నియోజకవర్గంలో యాక్టీవ్ కావడంతో ఎమ్మెల్యే కందాల వర్గం ఫైర్ అవుతున్నారు. తుమ్మలను అడ్డుకోకుంటే వచ్చే ఎన్నికల్లో తమకు ఇబ్బంది కలుగుతుందని భావించడంతో నియోజకవర్గంలో ఆధిపత్య పోరు ఎక్కువయింది. కందాలకు కూడా నియోజకవర్గంలో మంచి పేరుంది. స్థానికులకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడని టాక్.

ఇంత జరుగుతున్నా నియోజకవర్గంలో ఇద్దరు టిఆర్ఎస్ నేతలపై టిఆర్ఎస్ అధినాయకత్వం ఎటువంటి చర్యలు తీసుకుకోపోవడంతో నియోజికర్గంలో పార్టీ మీద తీవ్ర ప్రభావం పడుతుందని మిగితా నాయకులు వాపోతున్నారు. పాలేరులో తుమ్మల వర్సెస్ కందాల టామ్ అండ్ జెర్రీ ఫైటింగ్ పెద్ద తలనొప్పిగా మారింది. సీనియర్ నాయకుడైన తుమ్మలను అనలేక స్థానిక ఎమ్మెల్యే కందాలను నియంత్రించలేక టిఆర్ఎస్ నాయకత్వం సైలెంట్ గా ఉంటుంది. పోలీసులు కూడా పార్టీలో ఆధిపత్య పొరుతో నియోజకవర్గంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.