iDreamPost
android-app
ios-app

ఇండియా గెలిచినట్లే …!

ఇండియా గెలిచినట్లే …!

ఇంగ్లాండ్ భారత జట్ల మధ్య ఓవల్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్ లో భారత్ విజయానికి చేరువైంది. 368 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఆదిలో భారత బౌలర్లను దీటుగానే ఎదుర్కొన్నా సరే… ఆ తర్వాత మాత్రం తడబడింది. ప్రధానంగా జస్ప్రీత్ బూమ్రా, రవీంద్ర జడేజా, మహ్మద్ సిరాజ్ బౌలింగ్ ఆడటానికి ఇంగ్లీష్ ఆటగాళ్ళు కష్టపడ్డారు. ఏ మాత్రం కూడా లయ తప్పకుండా భారత బౌలర్లు ఇంగ్లీష్ బ్యాట్స్మెన్ ని ఇబ్బంది పెడుతున్నారు. కెప్టెన్ జో రూట్ ఒంటరి పోరాటం చేశాడు.

ఆల్ రౌండర్ క్రిస్ వోక్స్ తో కలిసి మ్యాచ్ ని కాపాడే ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. ఏడు వికెట్ ల నష్టానికి ఇంగ్లాండ్ ప్రస్తుతం 183 పరుగులు చేసింది. 77 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ మరో 23 పరుగులు చేసిన తర్వాత ఓపెనర్ బర్న్స్ వికెట్ కోల్పోయింది. శార్దుల్ ఠాకూర్… మంచి బౌన్స్ తో వికెట్ తీశాడు. ఇక ఆ తర్వాత డేవిడ్ మలన్ అనవసర పరుగు కోసం ప్రయత్నం చేసి రన్ అవుట్ అయ్యాడు. మలన్ అవుట్ అయిన కాసేపటికే… హసీబ్ హమీద్ జడేజా బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు.

ఆ వెంటనే ఒలి పోప్ కూడా అవుట్ కావడంతో ఇంగ్లాండ్ ఆత్మరక్షణలో పడింది. మొదటి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ని కాపాడిన బెయిర్‌ స్టో, ఓలి పోప్, మోయీన్ అలీ ముగ్గురిని భారత బౌలర్లు వెంటనే అవుట్ చేశారు. బెయిర్‌ స్టో, అలీ డకౌట్ కాగా పోప్ రెండు పరుగులు చేసాడు. ఆ తర్వాత వచ్చిన వోక్స్ తో కలిసి కెప్టెన్ రూట్ మ్యాచ్ ని కాపాడే ప్రయత్నం చేసారు. ఇద్దరూ సైలెంట్ గా భారత బౌలర్ల మీద ఎదురు దాడికి దిగారు. అయితే అనూహ్యంగా కొత్త బంతి వచ్చిన వెంటనే శార్దుల్ ఠాకూర్ ఇంగ్లాండ్ ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు.

కెప్టెన్ రూట్ ని అద్భుతమైన బంతితో 36 పరుగుల వద్ద అవుట్ చేసాడు. మరో మూడు వికెట్ లు మాత్రమే ఉండటం తో ఇంగ్లాండ్ ఈ మ్యాచ్ నుంచి బయట పడే అవకాశాలు దాదాపుగా లేవనే చెప్పాలి. కొత్త బంతితో భారత్ గనుక అద్భుతం చేస్తే మాత్రం ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ టీ లోపే ముగిసిపోయే అవకాశాలు ఉన్నాయి. క్రిస్ వోక్స్ దూకుడుగా ఆడి పరుగుల అంతరం తగ్గించే ప్రయత్నం చేసేయవచ్చు.