iDreamPost
iDreamPost
ఎప్పుడు చేరామన్నది కాదు.. ఎలాంటి ఫలితం సాధించామన్నది ముఖ్యమని విజయనగరం జిల్లా ఎస్.కోట నియోజకవర్గానికి చెందిన ఇందుకూరి రఘురాజు నిరూపించారు. మూడేళ్ల క్రితమే వైఎస్సార్సీపీలో చేరినా.. కీలకమైన ఎన్నికల సమయంలో పార్టీ విజయానికి కృషి చేసి తన నిబద్ధత, సత్తా నిరూపించుకున్నారు. ఈ ఏడాది మొదట్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీ విజయాల వెనుక వెన్నుదన్నుగా నిలిచారు. ఆయన కష్టాన్ని పార్టీ నాయకత్వం గుర్తించింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన్ను పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసింది.
Also Read : Ycp,MLC ఫలించిన వంశీకృష్ణ నిరీక్షణ
కాంగ్రెసుతో రాజకీయాల్లోకి
రఘురాజు 1998లో కాంగ్రెసులో చేరి రాజకీయాలు ప్రారంభించారు. చేరిన వెంటనే ఎస్.కోట మండల కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టి 2001 వరకు నిర్వహించారు. 2001 పరిషత్ ఎన్నికల్లో జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. 2006లో ఎంపీటీసీగా గెలిచిన అనంతరం మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవి చేపట్టారు. 2011 వరకు ఆ పదవిలో ఉన్న ఆయన .. జిల్లా ప్లానింగ్ కమిటీ సభ్యుడిగా, 2013-14 మధ్య జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్ గా పని చేశారు. మరోవైపు పార్టీపరంగా 2002 నుంచి 2005 వరకు యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా.. శ్రీకాకుళం, విశాఖ జిల్లాలకు ఇంఛార్జిగా వ్యవహరించారు. 1999 నుంచి 2009 వరకు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా, 2007 నుంచి 2009 వరకు విజయనగరం జిల్లా యువజన కాంగ్రెస్ కన్వీనరుగా పని చేశారు.
Also Read : Monditoka Arun Kumar- అరుణ్ అంకిత భావానికి జగన్ బహుమతి..
మూడేళ్లుగా వైఎస్సార్సీపీ లో..
రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసిన రఘురాజు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 23 వేలకుపైగా ఓట్లు సాధించారు. తర్వాత బీజేపీలో చేరి 2018 వరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా పని చేశారు. అనంతరం వైఎస్సార్సీపీలో చేరి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఎస్.కోటలో మంచి పట్టున్న నాయకుడిగా గుర్తింపు పొందిన రఘురాజు సేవా కార్యక్రమాలతోనూ ఆదరణ పొందారు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న ఆయన సేవలను గుర్తించిన సీఎం జగన్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేశారు.
Also Read : MLC, YCP -వరుదు కల్యాణికి ఎమ్మెల్సీ వరం