iDreamPost
android-app
ios-app

T20 World Cup – 130 కోట్ల మంది ఆశ 125 పరుగులు…

T20 World Cup – 130 కోట్ల మంది ఆశ 125 పరుగులు…

అవును, న్యూజిలాండ్ వర్సెస్ ఆఫ్ఘన్ జట్ల మధ్య జరుగుతున్న లీగ్ మ్యాచ్ కి సంబంధించి భారత్ మొత్తం కూడా చాలా ఆశగా ఎదురు చూస్తుంది. ఈ మ్యాచ్ లో ఆఫ్ఘన్ జట్టు గెలిస్తే పాయింట్ ల పట్టికతో పాటుగా నెట్ రన్ రేట్ ఆధారంగా టీం ఇండియా సెమి ఫైనల్ కు వెళ్తుంది. మొదటి రెండు మ్యాచులలో పాకిస్తాన్ అలాగే న్యూజిలాండ్ జట్ల మధ్య ఓటమి పాలైన టీం ఇండియా ఆ తర్వాత జరిగిన రెండు మ్యాచుల్లో భారీ విజయాలు నమోదు చేసి నెట్ రన్ రేట్ విషయంలో ముందు ఉంది.

అయితే పాయింట్ లు తక్కువగా ఉన్న నేపధ్యంలో న్యూజిలాండ్ జట్టు ఓడిపోతే టీం ఇండియా సెమి ఫైనల్ కు వెళ్తుంది. పాకిస్తాన్ ఇప్పటికే సెమి ఫైనల్ కు గ్రూప్ బీ నుంచి చేరుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ పై భారత్ ఫ్యాన్స్ ఎన్నో ఆశలు ఆఫ్ఘన్ జట్టుపై పెట్టుకోగా తొలుత బ్యాటింగ్ చేసిన నబీ సేన కేవలం 20 ఓవర్లలో 8 వికెట్ ల నష్టానికి 124 పరుగులు చేసింది. ఆ జట్టులో నజీబుల్లా ఒక్కడే బాగా రాణించాడు. మిగిలిన ఏ ఒక్కరు కూడా కనీసం 20 పరుగులు కూడా చేయలేదు. దీనితో జట్టు స్కోర్ పెద్దగా పరుగులు పెట్టలేదు.

నజీబుల్లా ఆడకపోయి ఉంటే ఆ స్కోర్ కూడా వచ్చేది కాదు. మూడు సిక్సులు ఆరు ఫోర్లతో అతను 73 పరుగులు చేసాడు. అయితే చివర్లో కెప్టెన్ నబీ, రషీద్ ఖాన్ జట్టు స్కోర్ ని పరుగులు పెట్టించడంలో విఫలం అయ్యారు. చివరి ఓవర్లో రెండు పరుగులు మాత్రమె రావడం ఆశ్చర్యపరిచింది. ఇక న్యూజిలాండ్ బ్యాటింగ్ లైనప్ ముందు ఆ స్కోర్ పెద్ద విషయం కూడా కాదు. ఆఫ్ఘన్ బౌలింగ్ లైనప్ కూడా అంత గొప్పగా లేకపోవడంతో న్యూజిలాండ్ గెలవడం దాదాపుగా ఖాయంగా కనపడుతుంది. న్యూజిలాండ్ మరో 40 పరుగులు చేసి ఉంటే కొద్దీ గొప్పా విజయావకాశాలు ఉండేవి.