దక్షిణాఫ్రికాతో ఇవాళే తొలి మ్యాచ్.. కుర్రాళ్ళ చేతిలో టీమిండియా..

త్వరలో జరగనున్న T20 ప్రపంచకప్‌ కోసం టీమిండియా ప్లేయర్లను తయారు చేసేందుకు BCCI గట్టిగానే కృషి చేస్తుంది. ఒకపక్క వరుస మ్యాచ్ లు పెట్టడమే కాకుండా కుర్రాళ్ళకి ఛాన్సులిస్తుంది. తాజాగా దక్షిణాఫ్రికాతో ఐదు T20 మ్యాచ్‌లు ఆడటానికి టీం ఇండియా సిద్ధమైంది. నేడు జూన్ 9న ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో రాత్రి 7 గంటలకు ఇరు జట్ల మధ్య తొలి T20 జరుగనుంది. అయితే ఈ సిరీస్ కి ఎక్కువగా కుర్రాళ్లతో కూడిన జట్టుని ఎంపిక చేశారు.

ఈ సిరీస్ కి రోహిత్‌ శర్మ, కోహ్లి, బుమ్రా లాంటి సీనియర్స్ కి విశ్రాంతి ఇచ్చారు. తాజాగా కెప్టెన్ గా అనౌన్స్ చేసిన రాహుల్, కుల్దీప్‌లు కూడా అనూహ్యంగా గాయాల కారణంగా జట్టుకి దూరమయ్యారు. దీంతో పంత్ ని కెప్టెన్ గా ప్రకటించారు. ఇక యువ క్రికెటర్లు రుతురాజ్‌ గైక్వాడ్, ఇషాన్‌ కిషన్‌, దీపక్‌ హుడా, హర్షల్‌ పటేల్‌, అవేశ్‌ ఖాన్, రవి బిష్ణోయ్‌లకు జట్టులో స్థానం కల్పించడంతో ఈ సారి కుర్రాళ్ళు మెరుపు మెరిపిస్తారని భావిస్తున్నారు. ఈ సిరీస్ లో బాగా ఆడితే రానున్న మరిన్ని మ్యాచ్ లలో ఈ కుర్రాళ్ళకి అవకాశం ఉండనుంది.

ఇక T20 క్రికెట్‌లో టీమిండియా గత 12 మ్యాచ్‌ల్లో వరుసగా విజయాలతో అజేయంగా ఉంది. తొలి T20లో దక్షిణాఫ్రికాని ఓడిస్తే వరుసగా 13 విజయాల జట్టుగా భారత్‌ సరికొత్త రికార్డ్ సృష్టిస్తుంది.

Show comments