వన్డే ప్రపంచ కప్-2023లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లాదేశ్ బాగా ఆడుతోంది. అనారోగ్యం కారణంగా రెగ్యులర్ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ షకీబల్ హసన్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు. దీంతో బంగ్లా సారథ్య బాధ్యతల్ని టాపార్డర్ బ్యాటర్ నజ్ముల్ హొస్సేన్ షంటో చేపట్టాడు. టాస్ నెగ్గిన షంటో ముందు బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఆ టీమ్‌కు సరైన ఆరంభం దక్కలేదు. మొదటి 5 ఓవర్లలో బంగ్లా స్కోరు కేవలం 10 రన్స్ మాత్రమే. టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా బాల్‌ను రెండు వైపులా స్వింగ్ చేస్తూ ప్రత్యర్థి ఓపెనర్లను ముప్పుతిప్పలు పెట్టాడు.
బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో తొలుత రన్స్ చేసేందుకు బంగ్లా ఓపెనర్లు ఆపసోపాలు పడ్డారు. అయితే క్రీజులో కుదురుకున్నాక బాల్ బ్యాట్ పైకి బాగా వస్తుండటంతో కౌంటర్ ఎటాక్‌కు దిగారు. ముఖ్యంగా సిరాజ్ బౌలింగ్‌లో రన్స్ పిండుకున్నారు. దీంతో హార్దిక్ పాండ్యాను దింపాడు రోహిత్ శర్మ. కానీ అతడు బౌలింగ్ వేస్తూ ఫాలో అప్‌లో రన్ ఆపేందుకు ప్రయత్నించి గాయపడ్డాడు. ఫిజియో వచ్చి ట్రీట్మెంట్ చేసినా ఇంజ్యురీ తగ్గకపోవడంతో హార్దిక్ గ్రౌండ్ వీడాడు. ఆ తర్వాత శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్‌లు బౌలింగ్‌కు దిగారు. తంజిద్ హసన్‌ను కుల్దీప్ వెనక్కి పంపాడు.
తంజిద్ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ షంటోను జడేజా పెవిలియన్ దారి చూపించాడు. బంగ్లాదేశ్ ప్రస్తుతం 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 131 రన్స్‌తో ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో బంగ్లా టీమ్ కొత్త రికార్డు సృష్టించింది. ఆ జట్టు ఓపెనర్లు తంజిమ్, లిటన్ కలసి మొదటి వికెట్‌కు 93 రన్స్ జోడించారు. వన్డే వరల్డ్ కప్ హిస్టరీలో బంగ్లాదేశ్‌కు ఇదే హయ్యెస్ట్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కావడం గమనార్హం. ఇది ఇండియాకు అవమానమనే చెప్పాలి. ఎందుకంటే పాకిస్థాన్, ఆస్ట్రేలియా లాంటి టీమ్స్‌తో జరిగిన గత మ్యాచుల్లో బ్యాటర్లను తక్కువ స్కోర్లకే వెనక్కి పంపారు మన బౌలర్లు.
పసికూన లాంటి బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను మాత్రం భారత బౌలర్లు ఆపలేకపోయారు. అందులోనూ ఆ టీమ్ ఓపెనర్ తంజిద్ హసన్ అయితే యంగ్‌స్టర్ కావడం, ఇంతకుముందు అతడి బెస్ట్ స్కోరు 16 కావడం గమనార్హం. అలాంటి బ్యాటర్‌ను సిరాజ్, బుమ్రా లాంటి భీకరమైన బౌలర్లు ఆపలేకపోవడం అవమానకరంగా భారత ఫ్యాన్స్ భావిస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. పసికూన బ్యాటర్లను బుమ్రా, సిరాజ్, శార్దూల్ కట్టడి చేయలేకపోయారని సీరియస్ అవుతున్నారు. మరి.. బంగ్లా ఓపెనర్లను భారత బౌలర్లు కట్టడి చేయలేకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: IND vs BAN: టీమిండియాకు బిగ్ షాక్! స్టార్ ప్లేయర్‌కు గాయం
Young Tanzid Hasan departs after registering his maiden international half-century on the big stage! pic.twitter.com/CymrTgJTkN
— CricTracker (@Cricketracker) October 19, 2023