వన్డే వరల్డ్ కప్-2023లో నాలుగో విజయం దిశగా టీమిండియా వడివడిగా అడుగులు వేస్తోంది. బంగ్లాదేశ్‌తో పూణె వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో భారత్ ఛేజింగ్ దిశగా దూసుకెళ్తోంది. ఈ మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 256 రన్స్ చేసింది. తంజిద్ హసన్ (51), లిట్టన్ దాస్‌తో పాటు మహ్మదుల్లా (46) రాణించారు. సీనియర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం (38) కూడా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అయితే బంగ్లా ఇన్నింగ్స్‌లో ఓపెనర్ తంజిద్ హసన్ బ్యాటింగ్ హైలెట్ అనే చెప్పాలి. బుమ్రా, సిరాజ్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని బౌండరీల మీద బౌండరీలు కొట్టాడు తంజిద్.
బంగ్లా ఇన్నింగ్స్‌లో ఆఖర్లో మహ్మదుల్లా వేగంగా బ్యాటింగ్ చేశాడు. అందుకే భారత్ ముందు మంచి టార్గెట్‌ను ఉంచింది. అయితే ఛేజింగ్‌కు దిగిన టీమిండియాకు అదిరిపోయే ఆరంభం దక్కింది. కెప్టెన్ రోహిత్ శర్మ (48), శుబ్‌మన్ గిల్ (53) బంగ్లా బౌలర్లపై అటాకింగ్‌కు దిగి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఇన్నింగ్స్ మొదట్లో రోహిత్ వరుస బౌండరీలు, సిక్సులతో విరుచుకుపడ్డాడు. హిట్‌మ్యాన్ వెనుదిరిగాక ఆ బాధ్యతను గిల్ తీసుకున్నాడు. ముస్తాఫిజుర్ వేసిన ఒక ఓవర్లో గిల్ మూడు ఫోర్లు కొట్టాడు. నసూమ్ అహ్మద్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. ఇక, ఈ మ్యాచ్‌కు లెజెండ్ సచిన్ టెండూల్కర్ గారాలపట్టి సారా టెండూల్కర్ అటెండ్ అయ్యారు.
మ్యాచ్ చూసేందుకు విచ్చేసిన సారా.. గిల్ వరుస సిక్సర్లు కొట్టిన టైమ్‌లో అతడ్ని ఎంకరేజ్ చేస్తూ కనిపించారు. చప్పట్లు కొడుతూ గిల్‌ను ప్రోత్సహించారు. కెమెరా కంటికి చిక్కిన ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ స్పందిస్తున్నారు. సారా స్టేడియానికి వచ్చింది గిల్ కోసమేనని కామెంట్స్ చేస్తున్నారు. పాకిస్థాన్ఫై తక్కువ స్కోరుకే ఔటైన శుబ్‌మన్.. సారా ఎంకరేజ్ చేయడంతో ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ బాదాడని ఫ్యాన్స్ అంటున్నారు. కాగా, సారా-గిల్ ప్రేమలో ఉన్నారని చాన్నాళ్లుగా సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. మరి.. గిల్‌ను సారా ఎంకరేజ్ చేయడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: VIDEO: వావ్ బుమ్రా.. బాల్ ఆఫ్ ది వరల్డ్ కప్ ఇదేనేమో!
Sara Tendulkar clapping after Shubman Gill’s two sixes. pic.twitter.com/cGKHDUyyX4
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 19, 2023