వన్డే వరల్డ్ కప్-2023లో టీమిండియా తన జోరును కొనసాగిస్తోంది. వరుస విజయాలతో జోష్ మీదున్న రోహిత్ సేన.. నాలుగో వన్డేలో అదే రేంజ్లో ఆడుతోంది. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగి బౌలింగ్ చేస్తున్నారు. ఇన్నింగ్స్ మొదట్లో మన బౌలర్లు వికెట్లు తీసేందుకు ఇబ్బంది పడ్డారు. బంగ్లాదేశ్ ఓపెనర్లు తంజిద్ హసన్ (51), లిటన్ దాస్ (66) చెలరేగి ఆడారు. అయితే 14వ ఓవర్ తర్వాత డ్రింక్స్ బ్రేక్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ తన వ్యూహాలను మార్చుకున్నాడు. బౌలర్లతో కలసి పిచ్‌కు తగ్గట్లు ప్లాన్స్ ఛేంజ్ చేశాడు. దీంతో బంగ్లా పతనం ప్రారంభమైంది.
హాఫ్ సెంచరీతో జోష్ మీద ఉన్న తంజిద్ మొదట ఔటయ్యాడు. ఆ తర్వాత వరుసగా షంటో, మెహ్దీ హన్, లిట్టన్ దాస్, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీం పెవిలియన్‌కు చేరుకున్నారు. పేసర్లు బుమ్రా, సిరాజ్‌తో పాటు స్పిన్నర్లు కుల్దీప్, జడేజా అద్భుతంగా బౌలింగ్ చేశారు. బంగ్లాదేశ్ ప్రస్తుతం 49 ఓవర్లలో 248 స్కోరుతో ఉంది. మహ్మదుల్లా (39), ముస్తాఫిజుర్ రెహ్మాన్ (0) క్రీజులో ఉన్నారు. 265 లోపు ప్రత్యర్థిని కట్టడి చేస్తే టీమిండియా విజయావకాశాలు మరింత పెరుగుతాయి. ఇక, ఈ మ్యాచ్‌లో భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న పూణె క్రికెట్ స్టేడియానికి సారా టెండూల్కర్ విచ్చేశారు. బంగ్లా ఇన్నింగ్స్ టైమ్‌లో పలుమార్లు ఆమె కెమెరా కంటికి చిక్కారు. వైట్ అండ్ పింక్ కలర్ డ్రెస్‌లో చూడటానికి హీరోయిన్లా ఉన్న సారా మ్యాచ్‌ను ఆస్వాదిస్తూ కనిపించారు. మ్యాచ్ చూసేందుకు సారా స్టేడియానికి రావడంపై సోషల్ మీడియాలో నెటిజన్స్ ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. కొందరు ఆమె ఇండియా టీమ్ పెర్ఫార్మెన్స్ చూసేందుకు వచ్చారని అంటున్నారు. మరికొందరేమో కాదు కాదు.. శుబ్‌మన్ గిల్ కోసమే సారా విచ్చేశారని చెబుతున్నారు. కాగా, టీమిండియా ఓపెనర్ గిల్-సారా టెండూల్కర్ మధ్య ప్రేమాయణం నడుస్తోందని గత కొన్నాళ్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి. మరి.. సారా స్టేడియంలో కనిపించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: World Cup: కొత్త రికార్డు సృష్టించిన బంగ్లాదేశ్! టీమిండియాకు అవమానం!
Sachin Tendulkar’s daughter Sara Tendulkar marks her presence for the match against India vs Bangladesh in Pune. pic.twitter.com/0r9XZ0xnTO
— CricTracker (@Cricketracker) October 19, 2023