iDreamPost
android-app
ios-app

బంగ్లా ఫ్యాన్స్​కు పాక్ నటి బంపరాఫర్.. భారత్​ను ఓడిస్తే డేట్​కు వస్తానంటూ..!

  • Author singhj Updated - 01:25 PM, Thu - 19 October 23
  • Author singhj Updated - 01:25 PM, Thu - 19 October 23
బంగ్లా ఫ్యాన్స్​కు పాక్ నటి బంపరాఫర్.. భారత్​ను ఓడిస్తే డేట్​కు వస్తానంటూ..!

వన్డే వరల్డ్ కప్​-2023లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ మీద టీమిండియా మరోమారు ఆధిపత్యం చెలాయించిన సంగతి తెలిసిందే. రీసెంట్​గా ప్రపంచ కప్​లో పాక్​ను భారత్ చిత్తుగా ఓడించింది. కాంపిటీషన్ టఫ్​గా ఉంటుందనుకున్న మ్యాచ్ కాస్తా వన్​ సైడ్ కావడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. కనీసం ఫైట్ చేయకుండానే బాబర్ సేన చేతులెత్తేయడంతో ఆ దేశ క్రికెట్ ఫ్యాన్స్ కోపంతో రగిలిపోతున్నారు. దీంతో వరల్డ్ కప్​లో నెక్స్ట్ జరిగే మ్యాచుల్లో టీమిండియా ఓడిపోవాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్​కు చెందిన స్టార్ నటి సెహర్ షిన్వారి ఓ సంచలన ప్రకటన చేసింది.

అక్టోబర్ 19వ తేదీన భారత్, బంగ్లాదేశ్ నడుమ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్​లో గనుక టీమిండియాను బంగ్లా ఓడిస్తే.. బంగ్లాదేశ్ ప్లేయర్​తో తాను డిన్నర్ డేట్​కు వెళ్తానని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది నటి సెహర్ షెన్వారి. ‘దేవుడా.. భారత్​ను బంగ్లాదేశ్ ఓడిస్తే వెంటనే ఢాకాకు వెళ్లి ఆ దేశ కుర్రాడితో డిన్నర్ డేట్​కు వెళ్తా’ అని సెహర్ తన ట్విట్టర్​ అకౌంట్​లో పోస్ట్ చేసింది. నటిగా మంచి పాపులారిటీ తెచ్చుకున్న సెహర్ షిన్వారి గతంలోనూ పలు వివాదాస్పద పోస్టులు చేసింది. ఈ సంవత్సరం ఆసియా కప్​లో సూపర్-4 మ్యాచ్​లో ఇండియాతో జరిగిన మ్యాచ్​లో పాక్ ఓటమిపాలైన విషయం తెలిసిందే. అప్పుడు దాయాది జట్టు కెప్టెన్ బాబర్ ఆజం, టీమ్​మేట్స్​ మీద కేసు పెడతానంటూ నెట్టింట పోస్ట్ పెట్టింది సెహర్.

పాక్ ప్లేయర్లు ప్రతిసారి క్రికెట్ ఆడేందుకు బదులు దేశ ప్రజల ఫీలింగ్స్​తో ఆడుకుంటున్నారని అప్పట్లో సెహర్ షిన్వారి ఆరోపించింది. ఇక, సెహర్ పర్సనల్ లైఫ్​ విషయానికొస్తే.. ఆమె పాక్​లోని సింధ్ ప్రావిన్స్​లోని హైదరాబాద్​లో జన్మించింది. షిన్వారి తెగకు చెందిన సెహర్ నటిగా బాగా రాణిస్తోంది. మొదట్లో ఆమె యాక్టింట్ వైపు వెళ్తానంటే కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు. అయితే పట్టువిడవకుండా తన డ్రీమ్​ను నిజం చేసుకుంది సెహర్. 2014లో ‘సైర్ సావా సైర్’ అనే కామెడీ సీరియల్ ద్వారా ఆమె టెలివిజన్ ఎంట్రీ ఇచ్చింది. మరి.. భారత్​ను ఓడిస్తే డేట్​కు వస్తానంటూ పాక్ నటి డేరింగ్ కామెంట్స్ చేయడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: షమి బదులు శార్దూల్ ఎందుకు? కారణం ఆ గుడ్డి నమ్మకమేనా?