వన్డే ప్రపంచ కప్-2023లో బంగ్లాదేశ్‌తో భారత్ ఆడుతున్న మ్యాచ్ ఇంట్రెస్టింగ్గా జరుగుతోంది. ఎక్స్పెక్ట్ చేసినట్లుగానే బంగ్లా మంచి పోటీ ఇస్తుండటంతో మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 256 రన్స్ చేసింది. ఆ టీమ్‌లో లిట్టన్ దాస్ (66), తంజిద్ హసన్ (51), మహ్మదుల్లా (46), ముష్ఫికర్ రహీం (38) రాణించారు. ముఖ్యంగా ఓపెనర్లు లిట్టన్, తంజిద్ సూపర్బ్‌గా బ్యాటింగ్ చేశారు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ లాంటి భీకరమైన పేసర్ల అటాక్‌ను ఎదుర్కొని రన్స్ చేశారు.
బంగ్లా యంగ్ బ్యాటర్ తంజిద్ హసన్ అయితే సిరాజ్, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అయితే డ్రింక్స్ బ్రేక్ తర్వాత బంగ్లాదేశ్ జోరుకు భారత బౌలర్లు బ్రేకులు వేశారు. స్పిన్నర్లు కుల్దీప్, జడేజాతో పాటు పేసర్లు బుమ్రా, సిరాజ్, శార్దూల్ ఠాకూర్లు పక్కా ప్లానింగ్ ప్రకారం బౌలింగ్ చేసి వరుసగా వికెట్లు తీశారు. అయితే చివర్లో మమ్మదుల్లా మెరుపు ఇన్నింగ్స్‌తో తన టీమ్‌కు ఫైటింగ్ స్కోరు అందించాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు మంచి స్టార్ట్ లభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ బాగా బ్యాటింగ్ చేశారు.
రోహిత్ శర్మ (48) బంగ్లా బౌలర్లపై అటాకింగ్‌కు దిగాడు. గిల్ (40 నాటౌట్) కూడా వరుస బౌండరీలతో ఆకట్టుకుంటున్నాడు. అయితే వీళ్ల పార్ట్‌నర్‌షిప్‌కు హసన్ మహ్మూద్ బ్రేక్ వేశాడు. అతడి బౌలింగ్ హిట్‌మ్యాన్ ఔట్ అయ్యాడు. కాగా, బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా వేసిన ఒక బాల్ హైలైట్ అనే చెప్పాలి. అప్పటికే క్రీజులో పాతుకుపోయిన మహ్మదుల్లాను ఓ అద్భుతమైన యార్కర్‌తో క్లీన్ బౌల్డ్ చేశాడు బుమ్రా. సాధారణంగా వేసే యార్కర్లకు భిన్నంగా వికెట్లకు దగ్గరగా తక్కువ ఎత్తులో వేసిన ఈ బాల్ ఒక్కసారిగా దూసుకొచ్చి వికెట్లను గిరాటేసింది. దీన్ని అడ్డుకుందామని ప్రయత్నించినా మహ్మదుల్లా ఫెయిల్ అయ్యాడు. ఈ వికెట్‌ను చూసిన నెటిజన్స్.. ఇది బాల్ ఆఫ్ ది వరల్డ్ కప్ అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరి.. బుమ్రా వేసిన ఈ డెడ్లీ యార్కర్ఫై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ ఇద్దరిలో ఎవరు బెస్ట్? DK ఆన్సర్ వైరల్
Jasprit Bumrah things 🤷♂️ pic.twitter.com/4xxFxHpfms
— Sky Sports Cricket (@SkyCricket) October 19, 2023