Idream media
Idream media
నరేంద్రమోడీః
చప్పట్లు కొట్టి కరోనాని శబ్దంతో భయపెట్టాడు. తర్వాత దీపం వెలిగించి కాంతితో భయపెట్టాడు. తర్వాత రకరకాల వేషాలతో గట్టిగా అరిచి కరోనాని భయపెట్టమంటాడు. మనవాళ్లు గుంపులు గుంపులుగా ఆ పని చేస్తారు. వున్న వాళ్లు లేని వాళ్లకి కరోనాని అంటిస్తారు.
అమిత్‌షాః
హోంమినిస్టర్ కాబట్టి ఇంటికే పరిమితమయ్యారు.
సోనియాగాంధీః
కాంగ్రెస్ పార్టీని ఐసొలేషన్‌లోనూ, వెంటిలేటర్ మీద వుంచే ప్రయత్నాల్లో వున్నారు.
చంద్రబాబుః
మాటలతో కోటలు దాటిస్తున్నాడు. జగన్‌కి ఉచిత సలహాలు ఇస్తున్నాడు. తాను అధికారంలో ఉంటే రాష్ట్రంలోకి కరోనా అసలు అడుగే పెట్టేది కాదని ఆయన నమ్మకం.
లోకేష్ః
ట్విట్టర్‌లో జోకులేస్తూ జోకేష్ అనిపించుకుంటున్నాడు.
సిపిఐ నారాయణః
కంకి కొడవలి పక్కన పెట్టి దీపాలు వెలిగించే పనిలో వున్నాడు.
లాలూప్రసాద్ యాదవ్ః
ఆయన్ని కరోనా ఏం చేయలేదు. రెండేళ్లుగా జైల్లో వుంటున్నాడు.
ఉద్దవ్‌థాకరేః
రోజూ టీవీల్లో మాట్లాడి, తాను ముఖ్యమంత్రినని ప్రజలకు గుర్తు చేస్తున్నాడు.
కేజ్రీవాల్ః
తాను పోలీసులు లేని ఏకైక ముఖ్యమంత్రినని అందరికీ ఉత్తరాలు రాస్తున్నాడు.