Idream media
Idream media
2014 ఎన్నికలకు ఏడాది ముందు వరకు నరేంద్ర మోదీ అంటే గుజరాత్ ముఖ్యమంత్రి. దేశ ప్రజలకు పెద్దగా పరిచయం లేని పేరు, మొహం ఆయనది. గోద్రా అల్లర్లకు కారణం మోదీనే, మోదీకి అమెరికా వీసా నిరాకరణ.. ఇలాంటి వార్తలు ఆయన గురించి పత్రికల్లో వచ్చేవి. కట్ చేస్తే.. ఎన్నికలకు ఏడాది ముందు నుంచి గుజరాత్ అభివృద్ధి నమూనా.. గుజరాత్‌ను మోదీ అభివృద్ధి చేశారు.. దేశానికి కాబోయే ప్రధాని,.. బీజేపీ ప్రధాన మంత్రి అభ్యర్థి.. గుజరాత్‌లో జరిగిన అభివృద్ధిపై కథనాలు, అనుకూల వార్తలు.. అన్ని పత్రికలు, టీవీ ఛానెళ్లలో ప్రచురితమయ్యాయి.. ప్రసారమయ్యాయి. మోదీ చాయ్‌వాలాగా పేరొందినా… బీసీ ప్రధానిగా వెలుగులోకి వచ్చినా.. అది పత్రికల పుణ్యమే. కారణాలు ఏమైనా.. మీడియా అంతా మోదీకి ఏకపక్షంగా మద్ధతు తెలిపింది.
సీన్ కట్ చేస్తే.. ప్రధాని అయిన తర్వాత ఇప్పటి వరకు గడిచిన ఏడేళ్లలో మోదీ ఒక్కసారి కూడా మీడియా ముందుకు రాలేదు. మీడియా ముందుకు ఎందుకు రారు..? అనే అంశాన్ని పట్టించుకోరు. మీడియా ముందుకు వచ్చినా.. రాకపోయినా.. మీడియాకు వచ్చిన నష్టం పెద్దగా ఉండదు. కానీ మీడియా గొంతును అణచివేస్తే,, పత్రికా స్వేచ్ఛను హరిస్తేనే.. నష్టం. అదే పని ప్రధాని మోదీ చేశారని చెబుతోంది ప్రఖ్యాత అంతర్జాతీయ సర్వే సంస్థ రిపోర్టర్స్ విత్‌అవుట్ బార్డర్స్.
ప్రపంచ వ్యాప్తంగా సదరు సంస్థ నిర్వహించిన సర్వేలో పత్రికా స్వేఛ్ఛలో 180 దేశాల్లో భారత్ 142వ స్థానంలో ఉందట. భారత్‌లో ప్రతికా స్వేచ్ఛను మోదీ హరిస్తున్నారని సర్వే సంస్థ ఎండగట్టింది. ప్రపంచ వ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛను హరిస్తున్న 37 మంది దేశాధినేతల్లో మోదీ ఒకరని తేలిపింది. ఈ 37 మందిలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తదితరులు ఉన్నారు. వీరి సరసన మోదీ కూడా నిలుచున్నారు. సోషల్ మీడియా వేదికల్లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న నేతగా పేరొందిన మోదీ.. పత్రికా స్వేచ్ఛను హరించే నేతల జాబితాలోనూ ప్రథమ వరుసలో ఉండడం విశేషం. అంతకు మించి ఏడేళ్ల కిత్రం తాను ప్రధానిగా అయ్యేందుకు దేశ వ్యాప్తంగా తనకు మద్ధతుగా ప్రచారం చేసిన మీడియాను.. ప్రధాని అయిన తర్వాత అణిచివేయడమే అత్యంత విచారకరం.
Also Read : సమయం ఆసన్నమైంది.. చలో ఢిల్లీ ..!