iDreamPost
iDreamPost
ఇంకో పదహారు రోజుల్లో ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న విజువల్ వండర్ అవతార్ 2 విడుదల కాబోతోంది. ఇండియాలోనూ భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు నిర్మాతలు పక్కా ప్లాన్ తో సిద్ధమయ్యారు. దీని దెబ్బకు ఆ వారంలో చెప్పుకోదగ్గ ఏ బాష సినిమాలు షెడ్యూల్ చేయలేదు. ఏపి తెలంగాణ నుంచే వంద కోట్లకు పైగా గ్రాస్ ని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. తమిళనాడు నుంచి మరో 50 కోట్లు టార్గెట్ ఉంది. కేరళలో మాత్రం ప్రస్తుతానికి అక్కడి డిస్ట్రిబ్యూటర్లు బ్యాన్ విధించారు. తమకు మొదటి వారం రెవిన్యూలో 60 శాతం ఇస్తేనే థియేటర్లు కేటాయిస్తామని లేనిపక్షంలో మా రాష్ట్రంలో విడుదల కానివ్వమని తేల్చి చెబుతున్నారు. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.
ఒకవేళ ఇవి సఫలీకృతం కాకపోతే కేరళ ఫ్యాన్స్ కి అవతార్ 2 దర్శనం ఉండదు. ప్రొడ్యూసర్లు 55 శాతం దాకా సిద్ధంగా ఉన్నప్పటికీ మల్లువుడ్ బ్యాచ్ మాత్రం ససెమిరా అంటున్నారట. ఒక్క అయిదు శాతం దగ్గరే తేడా వస్తోంది. అయినా వెనక్కు తగ్గేదేలే అంటూ మంకుపట్టు పడుతున్నారు. అన్నట్టు అవతార్ 2 వరల్డ్ వైడ్ టార్గెట్ ఎంతో తెలుసా. అక్షరాలా 16 వేల కోట్లు. దీనికి ఒక్క లక్ష తక్కువ వచ్చిన నష్టమేనని దర్శకుడు జేమ్స్ క్యామరూన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. హాలీవుడ్ మాత్రం దీని ఫీవర్ తో ఊగిపోతోంది. టాక్ కనక పాజిటివ్ వచ్చిందా వసూళ్ల జాతరకు అడ్డుకట్ట వేసేవారు ఉండరు. ఇది బ్లాక్ బస్టర్ అయితేనే తర్వాతి భాగాలు ఉంటాయి.
అవతార్ సిరీస్ లో క్యామరూన్ 5 భాగాలు ప్లాన్ చేశారు. ఒకవేళ అవతార్ 2 యావరేజ్ అయినా మూడోది ఫ్లాపయినా ఆ తర్వాతవి తీయనని చెప్పేశారు స్పైడర్ మ్యాన్, జురాసిక్ పార్క్, కింగ్ కాంగ్ తరహాలో దీన్నో కంటిన్యూ ఫ్రాంచైజ్ చేయలేనేదే ఆయన ఆలోచన. అవన్నీ సీక్వెల్స్ పరంగా ఒకదాన్ని మించి మరొకటి హిట్ అయిన సిరీస్ లు. అవతార్ కూడా అంతకు మించే స్పందన దక్కించుకుంటుందన్న నమ్మకం అభిమానుల్లో పుష్కలంగా ఉంది. ఎన్ని వేల స్క్రీన్లలో వరల్డ్ వైడ్ రాబోతుందనేది ఇంకొద్ది రోజుల్లో తేలనుంది. మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో రూపొందిన ఈ అద్భుతాన్ని ఐమ్యాక్స్ తెరమీద చూసేందుకు కోట్లాది ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు