iDreamPost
iDreamPost
ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, విజయవాడ, ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ జెండా ఆవిష్కరించారు సీఎం జగన్. అనంతరం, సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. శకటాల ప్రదర్శనను వీక్షించారు.
స్వాతంత్ర పోరాటానికి నిలువెత్తు రూపం జాతీయ జెండా. పింగళి వెంకయ్య తీర్చిదిద్దిన జాతీయ జెండా, భారతీయుల గుండె అని సీఎం జగన్ ప్రకటించారు. సార్వభౌమత్వానికి, ఏకత్వానికి, దేశభక్తికి, మన ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. వాదాలు వేరైనా దేశ స్వాతంత్రం లక్ష్యంగా పోరాడారు. వాళ్లను స్మరించుకుంటూ.. హ్యాట్సాఫ్ చెప్పాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు.
అహింసే ఆయుధం, సత్యయే సాధనంగా సాగిన శాంతియుత పోరాటం, ప్రపంచ మానవాళికి మోహోన్నత చరిత్రగా నిలిచే ఉంటుందన్న సీఎం 75 ఏళ్లలో దేశం తిరుగులేని విజయాలు సాధించిందని, ప్రపంచంతో పోటీ పడి మరీ ప్రగతి సాధిస్తోందని అన్నారు. రైతన్నలకు సెల్యూట్ చేశారు. ఆహారం, ఔషధాలు, స్మార్ట్ ఫోన్ల రంగంలోనూ దేశం టాప్ లిస్ట్‌లో కొనసాగుతోందని గుర్తుచేశారు. ఏపీ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై సీఎం జగన్ ప్రస్తావించారు.
మూడేళ్లలోనే రైతు సంక్షేమం కోసం, రైతు ప్రభుత్వంగా 83వేల కోట్లు, ధ్యానం సేకరణ కోసం 44వేల కోట్లు, మొత్తం మీద వ్యవసాయం మీద మన అందరి ప్రభుత్వం చేసిన ఖర్చు లక్షా 27వేల కోట్ల రుపాయిలని సీఎం జగన్ ప్రటకించారు. అందువల్లే, గత ఐదేళ్లతో పోలిస్తే, ఈ మూడేళ్లలోనే ఆహార ధాన్యాల సగటు ఉత్పత్తి 16 లక్షల టన్నులకు పెరిగిందని చెప్పారు. విత్తనం కొనుగోలు దగ్గర్నుంచి, పంట అమ్మకం వరకూ ఆర్‌బీకేల ద్వారా సేవలు ఇస్తున్నామని, అన్నం పెట్టే రైతన్నకు రైతు భరోసా అందిస్తున్నామని చెప్పారు. ఇన్‌పుట్ సబ్సిడీతోపాటు, సున్నా వడ్డీకే పంట రుణాలు అందిస్తున్నామని తెలిపారు.
సామాజిక న్యాయానికి పెద్ద పీటవేసిన మన అందరి ప్రభుత్వం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించామని చెప్పారు. మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన ప్రభుత్వం మనదని గర్వంగా చెప్పారు. ఈ సందర్భంగా, పరిపాలన వికేంద్రీకరణను ప్రస్తావించిన సీఎం జగన్, ప్రాంతీయ ఆకాంక్షలకు, ప్రాంతాల ఆత్మ గౌరవానికి అన్ని ప్రాంతాల సమతుల్యత అవసరమని, పటిష్ట బంధానికి ఇదే పునాది అని గట్టిగా నమ్మి అడుగులు వేస్తున్నామని తెలిపారు.