iDreamPost
android-app
ios-app

ఆగస్టులో వరుసగా 5 రోజుల సెలవులు.. లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు!

5 Days Holidays For Employees In August: ఆగస్టు నెలలో ఉద్యోగులకు ఒక భారీ శుభవార్త వెయిట్ చేస్తోంది. మీరు గనుక ఇలా చేశారు అంటే కచ్చితంగా వరుసగా 5 రోజుల సెలవులను ఎంజాయ్ చేయచ్చు.

5 Days Holidays For Employees In August: ఆగస్టు నెలలో ఉద్యోగులకు ఒక భారీ శుభవార్త వెయిట్ చేస్తోంది. మీరు గనుక ఇలా చేశారు అంటే కచ్చితంగా వరుసగా 5 రోజుల సెలవులను ఎంజాయ్ చేయచ్చు.

ఆగస్టులో వరుసగా 5 రోజుల సెలవులు.. లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు!

ఎన్ని సెలవులు ఉన్నా.. తీసుకున్నా కూడా మనకి మాత్రం ఎప్పుడెప్పుడు సెలవులు వస్తాయా అనే ఎదురుచూస్తూ ఉంటాం. పైగా వీకెండ్ వస్తోంది అంటే కచ్చితంగా ఒక ట్రిప్ ప్లాన్ చేయాలి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ, అందరికీ అది సాధ్యం కాదు. ఎందుకంటే ఒకటి, రెండ్రోజులకు ఏం వెళ్తాంలే అని లైట్ తీసుకుంటారు. అలాంటి వారికి ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చాం. మీరు గనుక ఇలా ప్లాన్ చేసుకున్నారు అంటే.. మీకు లాంగ్ వీకెండ్ దొరికేసినట్లే. ఏకంగా 5 రోజుల పాటు వీకెండ్ ని ఎంజాయ్ చేయచ్చు. అయితే ఇది అందరికీ వర్కౌట్ కాదు. కేవలం సాఫ్ట్ వేర్ జాబ్ హోల్డర్స్ మాత్రం ఈ సింపుల్ ట్రిక్ ఫాలో అయితే మ్యాక్సిమమ్ 5 రోజులు హాలిడే ఎంజాయ్ చేయచ్చు.

సాధారణంగానే సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేసే వారికి శనివారం, ఆదివారం సెలవు ఉంటుంది. ఆ రెండ్రోజుల సెలవులను చిన్న చిన్న వీకెండ్ ట్రిప్స్ ప్లాన్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. దగ్గర్లో ఉన్న స్పాట్స్ చూసి వస్తారు. అయితే మీరు గనుక లాంగ్ ట్రిప్ కోసం ప్లాన్ చేస్తూ.. సెలవులు లేవు అని డీలా పడితే మాత్రం వచ్చే నెలలో ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మీకు ఆగస్టు నెలలో ఏకంగా 5 రోజుల లాంగ్ వీకెండ్ దక్కే ఛాన్స్ ఉంది. మీరు కేవలం ఇలాంటి చిన్న టిప్స్ ని ఫాలో అయితే సరిపోతుంది. మధ్యలో ఒకరోజు మాత్రం మీరు సిక్ లీవ్ తీసుకోవాల్సి ఉంటుంది. అది గనుక సెట్ చేసుకుంటే.. మీరు నాలుగు నుంచి 5 రోజుల వరకు హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేయచ్చు.

5 రోజుల హాలిడేస్:

ఈ హాలిడేస్ ని ఆగస్టు 15 నుంచి ప్లాన్ చేసుకోండి. ఆగస్టు 15(గురువారం)న ఎలాగు నేషనల్ హాలిడేనే. ఆ తర్వాత మీరు ఆగస్టు 16న శుక్రవారం రోజు మాత్రం సిక్ లీవ్ గానీ.. క్యాజువల్ లీవ్ గానీ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆగస్టు 17, ఆగస్టు 18న శనివారం, ఆదివారం ఎలాగూ వీకెండ్ ఉంటుంది. ఆగస్టు 19న సోమవారం రాఖీ పండుగ సందర్భంగా కొన్ని కంపెనీలకు ఆప్షనల్ హాలిడే ఉంటుంది. మీ కంపెనీలో రాఖీ కూడా హాలిడే అయితే మాత్రం మీకు ఆగస్టు నెలలో వరుసగా 5 రోజుల సెలవులు వచ్చేసినట్లే. ఒకవేళ రాఖీ ఆప్షనల్ హాలిడే లేకపోయినా కూడా .. కనీసం 4 రోజుల లాంగ్ వీకెండ్ ని ఎంజాయ్ చేయచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఇప్పటి నుంచే ఎక్కడి వెళ్లాలి? ఎవరితో వెళ్లాలి? ఎంత బడ్జెట్ ఏంటి? అన్నీ ప్లాన్ చేసుకోండి. ఆగస్టు నెలలో లాంగ్ వీకెండ్ ని ఎంజాయ్ చేయండి.