కుమారుడి కోసం.. భర్త చేతిలో మరణించేందుకు అంగీకరించిన తల్లి

ఓ కుమారుడి కోసం ఆ తల్లి చేయరాని పని చేసింది. కడుపున పుట్టిన బిడ్డ కోసం బహుశా ఏ తల్లి ఇంత త్యాగం చేసి ఉండదేమో అనిపిస్తుంది. అయితే ఆమె ఏ ప్రయోజనం కోసమైతే చేసిందో.. అదే సమస్యగా మారింది. చివరకు కుమారుడి ఆ ఫలితం దక్కలేదు.

ఓ కుమారుడి కోసం ఆ తల్లి చేయరాని పని చేసింది. కడుపున పుట్టిన బిడ్డ కోసం బహుశా ఏ తల్లి ఇంత త్యాగం చేసి ఉండదేమో అనిపిస్తుంది. అయితే ఆమె ఏ ప్రయోజనం కోసమైతే చేసిందో.. అదే సమస్యగా మారింది. చివరకు కుమారుడి ఆ ఫలితం దక్కలేదు.

తల్లిని మించిన యోధులు లేరని ఓ సినిమాలో డైలాగ్. నిజమే మరీ బిడ్డలను నవమాసాలు మోసిన తల్లి.. ఆ పిల్లలు ప్రయోజకులయ్యేందుకు అహర్నిశలు పోరాడుతుంది. తను కడుపు మాడ్చుకుని.. పిల్లల బొజ్జలను నింపుతుంది. వారికి ఇష్టమైనవన్నీ కొనిస్తుంది. తండ్రి మందలిస్తే అడ్డుకుంటుంది. అవసరమైతే తండ్రితో కూడా గొడవపడుతుంది. వారి కోసం తన ప్రాణాలను పణంగా పెడుతుంది. ఇది నిజమని చెప్పేందుకు ఈ కథనమే నిజమైన ఉదాహరణ. కేవలం కుమారుడి కోసం భర్త చంపుతున్నా.. ఏ మాత్రం అడ్డు చెప్పకబోగా.. చావును ఆహ్వానించింది ఆ మహాతల్లి. అయితే ఆమె ఏ ప్రయోజనం కోసమైతే చేసిందో.. అదే సమస్యగా మారింది. ఇంతకు ఏమైందంటే..?

గుజరాత్‌లోని వల్సాద్‌కు చెందిన రంజిత్ దేశాయ్, అరుణ భార్య భర్తలు. అరుణ్ దేశాయ్ 2007 డిసెంబర్‌లో బ్యాంకు నుండి రూ. 15 లక్షల రుణం తీసుకున్నారు. అయితే ఏడాదికి చెల్లుబాటు అయ్యేలా 15 లక్షల వ్యక్తిగ ప్రమాద బీమా పాలసీ చేయించారు. ఈ క్రమంలో డిసెంబర్ 2008 డిసెంబర్ 12న అరుణ, ఆమె భర్త రంజిత్.. ధరంపూర్‌లోని భావ భవనేశ్వర్ ఆలయానికి వెళ్లారు. ఆలయ అతిధి గృహంలో ఓ గది అద్దెకు తీసుకున్నారు. క్యాన్సర్ పేషంట్ అయిన రంజిత్ గదిలో భార్య అరుణ గొంతు నులిమి చంపి, ఆ తర్వాత అతడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని బంధువులకు ఫోన్ చేసి చెప్పి.. ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. హత్య నిజమేనని నిర్ధారించారు.

కాగా, వీరి కుమారుడు జిమిత్ దేశాయ్ .. బీమా కంపెనీని ఆశ్రయించాడు. తన తల్లిదండ్రుల బీమా సొమ్ము రూ. 15 లక్షల ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నాడు. దాదాపు ఆరు నెలల తర్వాత అంటే 2009లో సదరు కంపెనీ అతడి క్లైయిమ్‌ను తోసిపుచ్చింది. అరుణను ఆమె భర్త ఉద్దేశపూర్వకంగా చంపాడని, దాన్ని ప్రమాదంగా పరిగణించలేమని పేర్కొంది. దీంతో జిమిత్.. బీమా కంపెనీకి వ్యతిరేకంగా.. 2010లో  సూరత్ వినియోగదారుల న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. దీంతో అతనికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ ఉత్తర్వును సవాలు చేస్తూ.. బీమా కంపెనీ అప్పీల్ చేసింది.  బీమా చేయించుకున్న తన తల్లిని భర్త చంపేస్తాడని  ఆమెకు ముందుగా తెలియదంటూ, ఇది ఊహించకుండా జరిగిన ప్రమాదమని ఫిర్యాదు దారు కోర్టులో వాదించారు.

సూసైడ్ నోటును ఉదాహరణ పేర్కొని,క్లెయిమ్ మంజూరు చేయాలని కోరారు. అయితే భర్త చేతిలో హత్యకు గురైన మహిళ తన పేరిట ఉన్న బీమా పరిహారాన్ని కుమారుడికి వచ్చేలా చేసేందుకు జరిగిన కుట్ర అని బీమా కంపెనీ చేసిన వాదనను వినియోగదారుల న్యాయస్థానం సమర్థించింది. ఇది హత్య కాదని, ఉద్దేశపూర్వకంగా జరిగిన ఆత్మహత్య అని తేల్చింది. ఆ మరణం ప్రమాదవశాత్తూ జరిగింది కాదని, భర్త హత్య చేస్తుండగా.. ఆమె ప్రతిఘటించకపోవడం.. ఆత్మహత్య అని రుజువు చేస్తుందని పేర్కొంది. ప్రమాద బీమా పొందే కుట్రలో భాగంగానే భర్తకు సహకరించిందని వినియోగదారుల కోర్టు నిర్ధారించింది.

Show comments