iDreamPost
android-app
ios-app

ఆ ఆనందం క‌నిపించ‌డం లేదా..? అంత క‌డుపు మంట ఎందుకు..?

ఆ ఆనందం క‌నిపించ‌డం లేదా..? అంత క‌డుపు మంట ఎందుకు..?

సొంతింట్లో ఉండాలనేది మా కల. దాని కోసం చేయని ప్రయత్నం లేదు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు దరఖాస్తు ఇచ్చామో లెక్కలేదు. జన్మభూమి కమిటీలు, నాయకుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయాం. కానీ ఫలితం లేదు. ఇంటి స్థలం మాకు లేదని వలంటీర్‌కు చెప్పాను. ఇంటి స్థలం మంజూరయ్యేలా చేశారు. ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇస్తుందని చెప్పడం చాలా సంతోషంగా ఉంది.
 – దోనిపర్తి శ్రీదేవి, మైపాడు, ఇందుకూరుపేట మండలం, నెల్లూరు జిల్లా

14 ఏళ్ల కిందట పొట్ట చేత పట్టుకుని ఈ గ్రామానికి వచ్చాం. అప్పట్నుంచి ఇంటి స్థలం కోసం 12 సార్లు అర్జీ పెట్టాను. అయినా ప్రయోజనం లేకపోయింది. సీఎం జగన్‌ చలువతో ఒక్క దరఖాస్తుతో ప్లాటు మంజూరైంది. అంతా కలగా ఉంది. స్థలం ఇవ్వటంతో పాటు ఇల్లు కట్టి ఇస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ మేలును ఎప్పటికీ మరువలేము.
తన్నీరు రమాదేవి, వీరపనేనిగూడెం, కృష్ణా జిల్లా

మాది కాకినాడ. నా భర్త సత్యనారాయణ కాలం చేశారు. మాకు ముగ్గురు పిల్లలు. సొంతంగా ఇల్లు లేదు. అవసాన దశకు చేరుకున్న నేను జీవితంలో సొంతిల్లు చూస్తాననుకోలేదు. ఎన్నికల్లో అవ్వాతాతలను ఆదుకుంటానని నా మనవడు జగన్‌ చెప్పిన మాటలు ఇవాళ అక్షరాలా నిజం చేశాడు. అధికారంలోకి రాగానే పింఛన్‌ ఇచ్చాడు. ఇప్పుడు స్థలం ఇచ్చి, ఇల్లు కట్టిస్తున్నాడు. వలంటీర్‌ వచ్చి.. అవ్వా నీకు ఇల్లు మంజూరైందని చెప్పగానే నా జీవితకాల కల నెరవేరినట్లైంది.
అడపా నాగసుగుణ, కాకినాడ, తూర్పు గోదావరి జిల్లా

బతుకుదెరువు కోసం పదేళ్ల కిందట ఎస్‌.కోట వచ్చాం. అద్దెలు కట్టలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఎప్పటికైనా సొంత ఇల్లు ఒకటి ఉంటే బావుంటుందని కలలు కనేవారం. ఇప్పుడు నాకు ఇంటి స్థలం ఇచ్చారు. కట్టుకోలేమన్న వారికి ప్రభుత్వమే ఇల్లు కట్టించి ఇస్తుందని జగన్‌ అన్న చెబుతున్నారు. ఆయన మాట చెప్పారంటే అది శాసనం. మాకు సొంత ఇల్లు వస్తుందన్న ఊహే చెప్పలేనంత ఆనందంగా ఉంది. మా కల నిజం చేసిన జగనన్నను ఎప్పటికీ మరచిపోం.
సింహాద్రి సంతోషి, ఎస్‌.కోట, విజయనగరం జిల్లా

… వీరంతా సొంతింటి కోసం ఏళ్ల త‌ర‌బ‌డి ఇబ్బందులు ప‌డుతున్న పేద‌లు. జ‌గ‌న్ ప్ర‌భుత్వం వారి ఇబ్బందులను తొల‌గించ‌డంతో సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఆ స్థ‌లం, ఇల్లు విలువ వారికి బాగా తెలుసు. అందుకే అంత‌లా ఉద్విగ్నానికి గుర‌వుతున్నారు. పేద‌లు ఆనందంగా, గౌర‌వంగా జీవించేందుకు సిద్ధ‌ప‌డుతుంటే కొంద‌రు నేత‌లు హీనంగా మాట్లాడుతుండ‌డం ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

అందుకేనా వీరికి క‌డుపుమంట‌..

పేద‌లు ఆనందంతో ఉంటే ప్ర‌తిప‌క్షాలు చూడ‌లేక‌పోతున్నాయి. తాము చేయ‌లేనిది జ‌గ‌న్ చేస్తున్నార‌ని లోలోప‌లైనా సంతోషించాల్సింది పోయి పేద‌ల‌ను కించ‌ప‌రిచేలా చ‌వ‌క‌బారు మాట‌లు అంటున్నారు. పేద‌లు ఇల్లు క‌ట్టుకుని నివ‌శించే స్థ‌లాన్ని బాత్రూమ్ ల‌ని, కుక్క‌ల దొడ్డిల‌ని పేర్కొంటుండ‌డం వారి విచ‌క్ష‌ణ‌కే వ‌దిలేస్తున్నామ‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు. పేద‌లు ఆనందంగా ఉంటే వారికి క‌డుపుమంట‌గా ఉంటోంద‌ని ఎద్దేవా చేస్తున్నారు.

చంద్ర‌బాబు సుపుత్రుడు లోకేశ్ ఆ స్థ‌లం బాత్రూమ్ క‌ట్టుకోవ‌డానికి కూడా చాల‌దంటున్నారు. చంద్ర‌బాబు త‌న‌యుడు కాబ‌ట్టి ఆయ‌న సెంట్ స్థ‌లంలో బాత్రూమ్ క‌ట్టుకోగ‌ల‌రు. మ‌రి పేద‌ల‌కు అది సాధ్య‌మా..? సీపీఐ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారాయ‌ణ అయితే పేద‌ల స్థ‌లాల‌ను కుక్కల దొడ్డితో పోల్చారు. ఓ క‌మ్యూనిస్టు నాయ‌కుడి వెంట అలాంటి మాట‌లు విని సొంత పార్టీ నాయ‌కులే ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇలా ఆయా నేత‌ల మాట‌లపై పేద‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.