iDreamPost
iDreamPost
మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న ఆచార్య షూటింగ్ ఇవాళ్టి నుంచి హైదరాబాద్ లో పునఃప్రారంభం కావాల్సి ఉంది. అయితే యూనిట్ కు కొత్తగా చేయించిన కోవిడ్ టెస్ట్ ఫలితాలు వచ్చేందుకు ఇంకో రెండు రోజులు సమయం పడుతుండటంతో మళ్ళీ వాయిదా వేశారని లేటెస్ట్ అప్ డేట్. చిరంజీవి కూడా ఇదే షెడ్యూల్ లో పాల్గొనబోతున్నారు. నీహారిక పెళ్ళికి ముందు కూడా కొన్ని సీన్స్ తీశారని ప్రచారం జరిగింది. అయితే వాటికి సంబంధించిన క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. వచ్చే ఏడాది మేకి ఎట్టి పరిస్థితుల్లో విడుదల చేయాలనే సంకల్పంతో ఉన్నారు నిర్మాతలు. చిరు సైతం వేదాళం రీమేక్ కోసం ఎదురు చూస్తున్నారు.
ఇంకో సమాచారం ప్రకారం దర్శకుడు కొరటాల శివ ఆచార్య కోసం కొన్ని కీలక మార్పులు చేశారట. రామ్ చరణ్ తొలుత అరగంట లేదా నలభై నిమిషాలకే పరిమితం చేయాలనుకున్నప్పటికీ లాక్ డౌన్ టైంలో దాన్ని పొడిగించినట్టు తెలిసింది. అంటే చరణ్ దాదాపు సినిమా మొత్తం ఉండేలా చేంజ్ చేశారట. కాకపోతే తను పాల్గొనే ఎపిసోడ్లు, పాటలు అన్నీ జనవరి నుంచి ఏకధాటిగా పూర్తి చేస్తారు. ఆపై చెర్రీ ఆర్ఆర్ఆర్ కోసం మళ్లీ బిజీ అయిపోతాడు. ఈ రకంగా ఆచార్య పక్కా ప్లానింగ్ తో రంగంలోకి దిగబోతోంది. ఇప్పటిదాకా జరిగిన షూట్ లో రెండు పాటలు కూడా ఫినిష్ చేశారు.
ఇక ఇందులో కీలక పాత్ర చేస్తున్న సోనూ సూద్ కోసం కూడా మార్పులు తప్పలేదని వినికిడి. లాక్ డౌన్ టైం తన దానగుణంతో నేషనల్ హీరోగా మారిపోయిన సోనుని ఎక్కువ నెగటివ్ గా ప్రొజెక్ట్ చేసినా ఇబ్బందే. అందుకే తప్పలేదట. దేవాలయాల్లో జరిగే స్కాములను ఆధారంగా చేసుకుని చిరుని ఒక పవర్ ఫుల్ పాత్రలో కొరటాల శివ ప్రెజెంట్ చేయబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా సంక్రాంతి పండగ కంటే ముందే జాయినయ్యే అవకాశాలు ఉన్నాయ. చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సంగీతం అందిస్తున్న మణిశర్మ మీద కూడా అభిమానులు చాలా హోప్స్ పెట్టుకున్నారు.