iDreamPost
android-app
ios-app

ఉదయనిధిని చెప్పుతో కొడితే రూ.10 లక్షలు! హిందూ సంస్థ పోస్టర్స్!

ఉదయనిధిని చెప్పుతో కొడితే రూ.10 లక్షలు! హిందూ సంస్థ పోస్టర్స్!

సనాతన ధర్మంపై కోలీవుడ్ నటుడు కమ్ తమిళనాడు క్రీడల శాఖ మంత్రి, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఇంకా దుమారం కొనసాగుతూనే ఉంది. హిందూ ధార్మిక సంఘాలు ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణలోకి తీసుకున్నాయి. అయోధ్యకు చెందిన స్వామి పరమహంస ఆచార్య ఒక అడుగు ముందుకు వేసి.. ఉదయ నిధి స్టాలిన్ తల నరికి తెస్తే రూ. 10 కోట్లు ఇస్తామంటూ వీడియో విడుదల చేశారు. అటు బీజెపీ నేతలంతా అతడిపై విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా, తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్న మంత్రి.. రూ. 10 కోట్లు ఎందుకు.. రూ. 10 రూపాయలు ఇస్తే.. దువ్వెన కొనుగోలు చేసి తన తలను తనే దువ్వుకుంటానంటూ కౌంటరిచ్చాడు. స్వామిజీలకు అంత డబ్బులు ఎక్కడ నుండి వస్తాయంటూ ఎదురు ప్రశ్నించారు. అలాగే తన కుమారుడు మాటలకు సీఎం స్టాలిన్ వెనకేసుకు వచ్చిన సంగతి విదితమే.

కాగా, అతడి తలపై నజారానాను రూ. 10 కోట్లను నుండి రూ. 20 కోట్లకు పెంచాడు స్వామిజీ. కాగా, తమిళనాడుకు చెందిన నామ్‌ తమిళర్‌ కట్చి నాయకుడు, ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు ఉదయనిధి స్టాలిన్ కు సపోర్టుగా నిలిచారు. ఉదయ నిధి తలపై రివార్డు ప్రకటించిన అయోధ్య స్వామిజీ తల తీసుకువస్తే రూ. 100 కోట్లు ఇస్తానంటూ ప్రకటించారు.  బీజెపీ, హిందూ సంఘాలు ఉదయనిధిపై ఫైర్ అవుతుంటే.. ఇటు తమిళనాడులోని సినీ, రాజకీయ ప్రముఖులు మంత్రికి మద్దుతుగా నిలుస్తున్నారు. సనాత్మన ధర్మం డెంగ్యూ, మలేరియా, కరోనా వంటి రోగాలతో పోల్చిన ఉదయనిధి.. దాన్ని సమూలంగా సమాధి చేయాలని వ్యాఖ్యానించాడు.  అతడి వ్యాఖ్యలను సమర్థించిన కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గేలపై ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ లో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది.

ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉదయనిధికి వ్యతిరేకంగా పోస్టర్లు, బ్యానర్లు వెలిశాయి. విజయవాడలో ఈ పోస్టర్లను ఏర్పాటు చేసింది హిందూ సంస్థ జగజాగరణ సమితి. అందులో ‘సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని బలుపెక్కి మాట్లాడిన ఉదయనిధి స్టాలిన్ ను చెప్పుతో కొట్టిన వారికి రూ. 10 లక్షల నగదు బహుమతి ఇవ్వబడును‘ అంటూ పేర్కొనబడి ఉంది. అంతేకాకుండా ఉదయనిధి స్టాలిన్ ఫోటోపై చెప్పును ఉంచి.. ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీనికి తోడు ఫోన్ నంబర్ కూడా జత చేశారు. కాగా, ఈ పోస్టర్ల గురించి చెన్నైలోని అధికార డీఎంకె వర్గాల వద్దకు సమాచారం చేరినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై మన ఉదయనిధి స్టాలిన్ ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.